
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘L2 ఎంపురాన్’. పృథ్విరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేస్తుండటంతో పాటు కీలకపాత్ర పోషిస్తున్నాడు. సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’కు ఇది సీక్వెల్.
లేటెస్ట్గా నేడు (మార్చి 20న) తెల్లవారుజామున ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. 3 నిమిషాల 50 సెకన్ల ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. యాక్షన్, డ్రామాతో కూడిన సీన్స్ ఇంపాక్ట్ ఇస్తున్నాయి.
అధికారం, దురాశ, ద్రోహం, ప్రతీకారంతో ఆధిపత్యం చెలాయించే ఎంపురాన్ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. మోహన్‌లాల్ రక్షకుడైన స్టీఫెన్ నేడుంపల్లిగా ఎదిగే క్రమాన్ని ఈ ట్రైలర్ చూపించిన విధానం ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా డ్రగ్ మాఫియా, జిహాదీ గ్రూపులు K-A (ఖురేష్ అబ్ రామ్) ఎంట్రీతో ట్రైలర్ మరింత వేడెక్కింది. మోహన్ లాల్ ఎంట్రీతో వచ్చే ఎలివేషన్స్, విజువల్స్ ఆసక్తిగా ఉన్నాయి.
ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ మరియు లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన 'ఎంపురాన్' మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ పాన్-ఇండియన్ చిత్రం మలయాళం, తమిళం, తెలుగు, హిందీ మరియు కన్నడ భాషలలో ఏకకాలంలో విడుదల కానుంది. నటుడు పృథ్వీరాజ్ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మురళి గోపి రచన చేశారు.
ఎల్2 స్టోరీ విషయానికి వస్తే:
లూసిఫర్ మూవీలో మోహన్‌లాల్ స్టీఫెన్ గట్టుపల్లి అనే ఓ పొలిటికల్ లీడర్ గా కనిపిస్తాడు. అయితే రాజకీయ నాయకుడు కాకముందు ఈ ప్రపంచాన్నే శాసించే ఓ మాఫియా లీడర్ అబ్రహాం ఖురేషిగా మారడం క్లైమాక్స్ లో చూపించారు. లూసిఫర్ సెకండ్ పార్ట్ లో అసలు ఒక సాధారణ వ్యక్తి అయిన స్టీఫెన్..మాఫియా లీడర్ అబ్రహాం ఖురేషి ఎలా అయ్యాడు? అతడు చేసిన పనులు ఏంటి? ఎందుకు రాజకీయ నాయకుడిగా మారాడు అని చూపించనున్నట్లు తెలుస్తుంది
అలాగే తన తమ్ముడైన టోవినో థామస్ ను ముఖ్యమంత్రిని చేసి విదేశాలకు వెళ్లిన లూసిఫర్ ఎవరు ? తండ్రి లాంటి వ్యక్తి నుంచి దూరమైన వ్యక్తి లూసిఫర్ గా ఎలా ఎదిగాడు ? అనేది ‘ఎల్2:ఎంపురాన్ సీక్వెల్లో చూపించనున్నారు.