The Goat Life OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి మలయాళ బ్లాక్ బస్టర్-మారిన ప్లాట్‌ఫామ్-స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) నటించిన లేటెస్ట్ ఆడు జీవితం( ది గోట్‌లైఫ్‌).దర్శకుడు బ్లేస్సి తెరకెకెక్కించిన ఈ సినిమా మర్చి 28న థియేటర్లలోకి వచ్చి మంచి విజయం సాధించింది.మొదటి షో నుండి పాజిటీవ్ టాక్ రావడంతో..బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.151కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

సర్వైవల్ థ్రిల్లర్‌ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాలో..నజీబ్ పాత్రలో పృథ్వీరాజ్ నటన,ట్రాన్స్‌ఫర్మేషన్ కు ఆడియెన్స్ ఫిదా అయ్యారు.ఈ సినిమాకి ప్రెస్టీజియస్ అవార్డ్స్ రావడం పక్కా అంటూ విమర్శలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.2008లో అత్య‌ధికంగా అమ్ముడైన మ‌ల‌యాళ న‌వ‌ల ‘గోట్ డేస్‌’. నిజ జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌నల్ని ఆధారంగా చేసుకుని బెన్యామిన్ ఈ న‌వ‌ల రాశారు.దీని హక్కులు కొనుగోలు చేసి,దాదాపు పదేళ్ల పాటు స్క్రిప్ట్‌ వర్క్‌ చేశారు దర్శకుడు బ్లెస్సీ.రూ.88 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.  

Also Read:-అభిషేక్, ఐశ్వర్యలు రూమర్లకు చెక్ చెప్పినట్లేనా..?

ఇదిలా ఉంటే..మార్చి 28న థియేటర్లోకి వచ్చిన ది గోట్ లైఫ్ సినిమా 5 భాషల్లో ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది.ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా జులై 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది.ఈ విషయాన్ని తెలియజేస్తూ నెట్‌ఫ్లిక్స్‌ తాజాగా సోషల్‌మీడియాలో పోస్ట్‌ పెట్టింది. మలయాళంతోపాటు తమిళం,తెలుగు,కన్నడ,హిందీ భాషల్లో ఇది ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుందని తెలిపింది.ఈ మూవీ రిలీజైన 4నెలల తర్వాత ఓటీటీలోకి వస్తుండటంతో నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ది గోట్‌లైఫ్ ఓటీటీ హక్కులను ముందుగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దక్కించుకుందని సమాచారం రాగా ఇక తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. 

ఆడు జీవితం కథ:

సర్వైవల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది ఈ సినిమా.నజీబ్ అహ్మద్ అనే వ్యక్తి ఉపాధి కోసం,అతడి స్నేహితుడు హకీం(కేఆర్ గోపాల్‌) సౌదీ వెళతారు. అక్కడ ఎదురైన కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఇద్దరు గొర్రెల కాసే పని చేయాల్సి వస్తుంది.ఆ ఎడారిలో ఉండటానికి గూడు లేక,తినడానికి తిండి లేక దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటాడు నజీబ్.మరి అలాంటి పరిస్థితి నుండి నజీబ్ ఎలా తప్పించుకున్నాడు? అందుకోసం ఎలాంటి కష్టాలు పడ్డాడు? చివరకు ఎం జరిగింది అనేది మూవీ కథ.

Also Read:-థియేటర్లో వర్షం చినుకులు..‘కల్కి’షో నిలిపివేత!..పోలీస్ కంప్లైంట్!!