
మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ అడ్వెంచరస్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రియాంక చోప్రా కూడా ఈ మూవీలో జాయిన్ అయింది. అయితే అధికారికంగా ప్రకటించలేదు.
ఇదిలా ఉంటే మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమార్ ఇందులో కీలకపాత్ర పోషించబోతున్నట్టు గత కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీనిపై ఆయన స్పందించారు. ‘‘నాకంటే మీడియాకే చాలా విషయాలు తెలిశాయి. ఇంకా ఏ విషయంపై స్పష్టత రాలేదు. చర్చలు జరుగుతున్నాయి. ఫైనల్ అయ్యాక దీనిపై మాట్లాడుకుందాం’’ అన్నారు.
ఇదిలా ఉంటే.. నెగిటివ్ రోల్ కోసం మొదట పృథ్విరాజ్‌ను అనుకున్నప్పటికీ, తర్వాత జరిగిన మార్పులతో ఆ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహంను తీసుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎలాంటి లీకులు రానీయకుండా రాజమౌళి టీమ్ ఎంతో కేర్ తీసుకుంటున్నప్పటికీ ఈ తరహా కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి.
ఏదేమైనా ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌లో తాను లేనని క్లారిటీ ఇచ్చారు పృథ్విరాజ్ సుకుమారన్. ఇక మోహన్ లాల్ హీరోగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘లూసిఫర్’ సీక్వెల్ ‘ఎల్ 2ఇ ఎంపురాన్’ మార్చి 27న విడుదల కానుంది.