నిజామాబాద్ జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సులో రూ. 13 లక్షల చోరీ జరిగింది. నగర శివారులోని సారంగాపూర్ దగ్గర బ్యాగుతో బస్సు నుంచి కిందికి దిగిన వ్యక్తి వద్ద గుర్తు తెలియని వ్యక్తి దోచుకెళ్లాడు. ఆదివారం(జనవరి 14) ఉదయం ఓ ప్రైవేట్ బస్సు ముంబై నుంచి జగిత్యాల వెళ్తోంది. అయితే ఆ బస్సులో హనుమంతు అనే వ్యక్తి రూ. 13 లక్షలు తీసుకొని జగిత్యాలకు వెళ్తున్నాడు. సారంగాపూర్ డైరీ ఫార్మ్ దగ్గర ఓ హైటల్ వద్ద బస్సు ఆపి ప్రయాణికులు టీ తాగేందుకు ఆగారు. అదే అదునుగా భావించిన దుండగులు హనుమంతు బ్యాగును లాక్కొని వెళ్ళాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రైవేట్ బస్సును పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారణ చేపట్టారు. అనంతరం బస్సులో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అయితే గుర్తుతెలియని దుండగుడు సీసీ కెమెరాకు చెయ్యి పెట్టి దొంగతనానికి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. దుండగుడిని పట్టుకునేందు పోలీసులు అన్ని కోణాల్లో గాలింపు చర్యలు చేపడుతున్నారు.