బకాయిల కోసం డిగ్రీ పరీక్షలకు బ్రేక్..

బకాయిల కోసం డిగ్రీ పరీక్షలకు బ్రేక్..
  • ఆందోళనకు దిగిన ప్రైవేట్​ డిగ్రీ కాలేజీలు
  • ఓయూ పరిధిలోని పలు కాలేజీల్లోలేట్​గా ప్రారంభమైన పరీక్షలు

ఇబ్రహీంపట్నం, వెలుగు: ఓయూ పరిధిలోని పలు ప్రైవేటు కాలేజీల్లో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు మంగళవారం లేట్​గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటలకు ఇంగ్లిష్​ పరీక్ష ప్రారంభం కావాల్సి ఉండగా, ప్రభుత్వం ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు చెల్లించే వరకు పరీక్షకు అనుమతించమని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు​అల్టిమేటం జారీ చేశాయి.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ప్రతిభా, వసుంధర తదితర ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో పరీక్షా సమయానికి విద్యార్థులు చేరుకోగా, యాజమాన్యాలు లోపలికి అనుమతించలేదు. 

దీంతో ఓయూ వీసీ కుమార్, హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఫోన్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. రెండు రోజుల్లో సీఎంతో మాట్లాడిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో ప్రైవేటు కాలేజీలు వెనక్కి తగ్గాయి. ఎట్టకేలకు ఉదయం10.45 గంటలకు పరీక్షలకు అనుమతించారు.