ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి.. ఇప్పటి తరానికి దీని గురించి తెలియకపోవచ్చు కానీ.. 1970,80ల నాటి యువతకు బాగా తెలుసు. అప్పట్లో టెన్త్, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లు చేతికందగానే మొదట చేసే పని.. ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజికి వెళ్లి వివరాలు నమోదు చేసుకోవటం. అప్పట్లో జాబ్ నోటిఫికేషన్స్ దగ్గర నుంచి జాబ్ కి అప్లై చేసుకోవడం వంటి ముఖ్యమైన పనుల కోసం ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజిల దగ్గర బారులు తీరేవారు యువత.. ఇప్పుడీ ఉపోద్గాతమంతా ఎందుకంటే.. నిర్వీర్యమైపోయిన ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి వ్యవస్థను పునరుద్దరించే దిశగా కేంద్రం అడుగులేస్తోంది.
ఎంప్లాయిమెంట్ నిబంధనల్లో మార్పుల దిశగా చర్యలు తీసుకునుటున్నట్లు తెలిపింది ప్రభుత్వం. ఇందులో భాగంగా ప్రైవేటుకంపెనీలు ఉద్యోగ ఖాళీలను ప్రభుత్వానికి రిపోర్ట్ చేయటం వంటి కీలక నిర్ణయాలు ఉంటాయని తెలిపింది. ఉద్యోగ నియామకాల్లో ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని.. ఇందుకోసం జరిమానాను రూ. 100 నుండి రూ. 50,000కి పెంచాలని బావిస్తున్నట్లు తెలిపింది.
Also Read :- ఓటీటీలోకి 15కి పైగా సినిమాలు, సిరీస్లు
ఈ క్రమంలో లింక్డ్ ఇన్ తరహాలో ప్రభుత్వ జాబ్ పోర్టల్ తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నామని.. ఈ పోర్టల్ లో ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా ఉండేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది ప్రభుత్వం. అయితే.. ఈ విధానానికి ప్రైవేటు కంపెనీలు ఎంతవరకు సహకరిస్తాయి అన్నది వేచి చూడాలి.