
కూసుమంచి, వెలుగు : ఖమ్మంవరద బాధిత పిల్లలకు నోటు జిల్లాలో మున్నేరు పరీవాహక ప్రాంతంలోని వరద బాధితుల పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థలు శనివారం నోట్ బుక్స్ పంపిణీ చేశాయి. కూసుమంచి మండల కేంద్రంలోని గ్లోబల్- రెయిన్ బో స్కూల్, ఖమ్మం నగరంలోని బ్లూమింగ్ మైండ్ ఆధ్వర్యంలో ఐదువేల నోట్ బుక్స్ ను జలగంనగర్ తో పాటు అనేక కాలనీల్లోని పిల్లలకు పొంగులేటి ప్రసాద్ రెడ్డితో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ శశిధర్ రెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎర్షాద్ అహ్మద్, జిల్లా ఉపాధ్యక్షుడు అశోక్ రెడ్డి ఉన్నారు.