హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అనుమతు లకు సంబంధించి సాంకేతిక విద్యా చట్టంలోని సెక్షన్ 20ని సవాల్ చేస్తూ ఇంజినీరింగ్ కాలేజీలు దాఖలు చేసిన కేసుల్లో వాటికి నిరాశ ఎదురైంది.
కొత్త కోర్సుల ప్రారంభం, సీట్ల పెంపు, కుదింపు, కోర్సుల విలీనం, కోర్సుల రద్దుకు ప్రభుత్వ అనుమతిని నిరాకరిస్తూ ఆగస్టు 24న జారీ చేసిన మెమోతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అనుమతులకు సంబంధించి సాంకేతిక విద్యా చట్టంలోని సెక్షన్ 20ని సవాల్ చేస్తూ పలు కాలేజీలు.. వేర్వేరుగా 11 పిటిషన్లు వేశాయి. వీటిని గురువారం విచారించిన హైకోర్టు కాలేజీల మధ్యంతర పిటిషన్లను డిస్మిస్ చేసింది.