- రూ.40 లక్షలతో ప్లాట్ కొనుగోలు..
- రూ.60లక్షలతో చిట్టీలు, సహకరించిన ఉద్యోగులకు రూ.70లక్షలు
- ప్రైవేట్ కంపెనీకి చెందిన ఇద్దరు ఉద్యోగులు అరెస్ట్
గచ్చిబౌలి, వెలుగు : పనిచేసే కంపెనీకి చెందిన క్యూఆర్ కోడ్లకు బదులు తమ పర్సనల్ క్యూఆర్ కోడ్లు పెట్టి రూ.4.15 కోట్లు కొట్టేసిన ఇద్దరు ఉద్యోగులను సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైబరాబాద్‌లోని కొండాపూర్‌లో ఇస్తారా పార్క్స్ప్రైవేట్లిమిటెడ్ పేరుతో ఓ కంపెనీ నడుస్తోంది. ఈ కంపెనీకి హాస్పిటాలిటీ, కో లివింగ్ ప్రాపర్టీస్బిజినెస్లు ఉన్నాయి. వీటితోపాటు ఇండియాలోని 16 నగరాల్లో ఫుడ్‌కోర్టులు నిర్వహిస్తోంది.
సిటీలోని చెంగిచెర్లకు చెందిన యాసిరెడ్డి అనిల్‌కుమార్(41), సికింద్రాబాద్‌కు చెందిన మందాల రాజ్‌కుమార్ ఇస్తారా పార్క్స్‌లో ఫ్లోర్ మేనేజర్లుగా పనిచేస్తున్నారు. కాగా అనిల్‌కుమార్ హైదరాబాద్‌లోని వివిధ ఔట్లెట్లలో కంపెనీ క్యూఆర్ కోడ్‌కు బదులు తన పర్సనల్ క్యూఆర్ కోడ్‌ను పెట్టాడు. కంపెనీకి చేరాల్సిన పైసలను అనిల్‌కుమార్ తన పర్సనల్అకౌంట్లో క్రెడిట్ అయ్యేలా చేసుకున్నాడు. కంపెనీ ప్రతినిధి మహ్మద్ ఇర్షాద్హుస్సేన్ఈ విషయాన్ని గుర్తించి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో కస్టమర్ల నుంచి కంపెనీకి రావాల్సిన రూ.4.15 కోట్లు దారిమళ్లినట్లు గుర్తించారు.
రంగంలోకి దిగిన సైబరాబాద్ ఎకనామిక్అఫెన్స్వింగ్పోలీసులు అనిల్‌కుమార్ తోపాటు రాజ్‌కుమార్ కంపెనీ క్యూఆర్ కోడ్‌కు బదులు తమ పర్సనల్ క్యూఆర్ కోడ్ పెట్టి ఫ్రాడ్ చేసినట్లు గుర్తించారు. ఇద్దరినీ అరెస్ట్ చేశారు. అనిల్‌కుమార్ రూ.2 కోట్ల వరకు తన అకౌంట్‌కు మళ్లించుకున్నట్లు విచారణలో తెలిపాడు. రూ.40 లక్షలతో ప్లాట్ కొన్నట్లు చెప్పాడు. ఈ ఫ్రాడ్‌లో హెల్స్చేసిన సహోద్యోగులకు రూ.70 లక్షలు ఇచ్చానని, రూ.60 లక్షలతో చిట్టీలు వేశానని, మిగిలిన డబ్బును సొంత ఖర్చులకు వాడుకున్నట్లు ఒప్పుకున్నాడు. రాజ్‌కుమార్‌కు రూ.10 లక్షలు ఇచ్చానని చెప్పాడు.