ప్రైవేట్ ఆస్పత్రిలో డబ్బులు వసూలు చేస్తున్న ఫేక్ DMHO

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రంలో ఫేక్ డీఎంహెచ్ఓ అధికారి తనిఖీల పేరుతో హడావిడీ చేశాడు. ప్రైవేట్ హాస్పటల్ లో తనిఖీల పేరుతో డబ్బు వసూలు చేస్తూ పట్టుబడ్డాడు. ఇతను గతంలో కంటి వెలుగు పథకంలో పనిచేశాడని తెలిపారు హాస్పిటల్ సిబ్బంది.

 తాను డీఎంహెచ్ఓ సిబ్బందిని అంటూ చెప్పుకుంటున్న వ్యక్తి బాలకృష్ణగా గుర్తించారు. మొదట్లోనే అతని తీరుపై హాస్పిటల్స్ సిబ్బందికి అనుమానం రావడంతో గట్టిగా నిలదీశారు. దీంతో అసలు బాలకృష్ణ అసలు స్వరూపం బయటపడింది.