ప్రైవేట్​ దవాఖానలు ఆరోగ్యశ్రీలో చేరాలి : డీఎంహెచ్ వో వెంకట్​

ప్రైవేట్​ దవాఖానలు ఆరోగ్యశ్రీలో చేరాలి : డీఎంహెచ్ వో వెంకట్​

పద్మారావునగర్, వెలుగు: 30, అంతకంటే ఎక్కువ పడకలున్న ప్రైవేటు దవాఖానలు ఆరోగ్యశ్రీలో చేరి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించాలని డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌ వో వెంకట్‌‌‌‌‌‌‌‌ కోరారు. రాజీవ్‌‌‌‌‌‌‌‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్‌‌‌‌‌‌‌‌ ట్రస్ట్‌‌‌‌‌‌‌‌ సహకారంతో సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌ గాంధీ మెడికల్‌‌‌‌‌‌‌‌ కాలేజీ అలుమ్నీ భవనంలో శుక్రవారం ఓరియెంటేషన్‌‌‌‌‌‌‌‌ ప్రోగ్రాం నిర్వహించారు.   ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ పరిధిలో 105 దవాఖానలు ఇప్పుటికే ఆరోగ్యశ్రీలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నాయని, అర్హత ఉన్న ఆసుపత్రుల యాజమాన్యాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఎంప్యానల్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ప్రక్రియ, డాక్యుమెంటేషన్, ఎంవోయూ తదితర అంశాలను ట్రస్ట్‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌ రాంబాబు పవర్‌‌‌‌‌‌‌‌పాయింట్‌‌‌‌‌‌‌‌ ప్రజెంటేషన్‌‌‌‌‌‌‌‌ ద్వారా వివరించారు. ఎస్‌‌‌‌‌‌‌‌పీహెచ్‌‌‌‌‌‌‌‌వో రాములు, జిల్లా మాస్‌‌‌‌‌‌‌‌ మీడియా అధికారి నరసింహ, మెడికల్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్లు, ప్రోగ్రాం ఆఫీసర్లు, ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు పాల్గొన్నారు.