- ఆర్ఎంపీ ముసుగులోనే ఎంబీబీఎస్ డాక్టర్‌గా చెలామణి
- బీటెక్ విద్యార్థి మృతితో వైద్యాధికారుల కొరడా
లింగంపేట, వెలుగు : కామారెడ్డి జిల్లా లింగంపేటలో ప్రభుత్వనిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న రాహుల్ క్లినిక్, ఆపరేషన్ థియేటర్‌ను బుధవారం జిల్లా వైద్యఆరోగ్యశాఖ ప్రొగ్రాం అధికారి ప్రభుకుమార్, సిబ్బందితో కలిసి సీజ్ చేశారు. రాహుల్క్లినిక్ పేరిట ఆర్ఎంపీ వైద్యుడు రాజు ఎంబీబీఎస్ డాక్టర్ హరినారాయణతో కలిసి ఆసుపత్రిని నిర్వహిస్తున్నట్లు బోర్డులు ఏర్పాటు చేశాడు. అందులో ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసి ఆపరేషన్లు చేస్తున్నట్లు గుర్తించామన్నారు.
ఎంబీబీఎస్ డాక్టర్ పర్యవేక్షణలో రోగులకు ట్రీట్‌మెంట్ చేయాల్సి ఉండగా ఆర్‌ఎంపీ వైద్యుడు రాజు ఒక్కడే వైద్యం చేస్తున్నాడని రోగులకు వివిధ రకాల టెస్టుల కోసం రిఫర్ చేస్తున్నట్లు తేలింది. మండలంలోని బాయంపల్లి తండాకు చెందిన బీటెక్ స్టూడెంట్‌కు వైద్యం అందించినట్లు విచారణలో తేలిందని దీంతో ఆసుపత్రిని సీజ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక పీహెచ్సీ డాక్టర్ హిమ బిందు, సిబ్బంది రమేశ్,శ్రీనివాప్,శివయ్య, ఫరీదా,యాదగిరి, తదితరులు ఉన్నారు.