ఢిల్లీలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. దీంతో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులను మూసివేయాలని నిర్ణయించింది. ఎమర్జన్సీ సర్వీసులు మినహా మిగిలిన ఉద్యోగులు అందరూ ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించింది. మినహాయించిన కేటగిరీకి చెందిన ప్రైవేట్ కంపెనీలు మినహా ... మిగిలిన ఆఫీసులు మూసివేయాలని ఆదేశించింది. నిత్యావసర , అత్యవసర సేవలు మినహా అన్నింటికీ ఆదేశాలు వర్తిస్తాయని డీడీఎంఏ పేర్కొంది. ఢిల్లీలో పాజిటివ్ రేటు 23 శాతానికి పెరిగిన నేపథ్యంలో కఠిన నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. వైద్య, మీడియా సిబ్బందికి మినహాయింపులు ఇచ్చింది. వారంతా బయటకు వచ్చినప్పుడు ఐడీ కార్డ్స్ తప్పకుండా చూపించాలని ఆదేశించింది. ఇక కరోనా టెస్టుల కోసం వెళ్లిన వారికి, ఆరోగ్య పరీక్షలు చేయించుకునే గర్భిణీ స్త్రీలకు కూడా పర్మిషన్ ఇచ్చింది. ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే వారు తప్పకుండా తమ ప్రయాణానికి సంబంధించిన టికెట్ అధికారులకు చూపించాలని ఆదేశించింది డీడీఎంఏ.
Private offices in Delhi shall be closed, barring the ones in the exempted category; work from home shall be followed: DDMA pic.twitter.com/yPkwDR8t3o
— ANI (@ANI) January 11, 2022
ఇవి కూడా చదవండి: