ప్రైవేట్ స్కూల్స్​లో జోరుగా పుస్తకాల దందా

ప్రైవేట్ స్కూల్స్​లో జోరుగా పుస్తకాల దందా

హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్ స్కూల్స్ లో పాఠ్యపుస్తకాల దందా ఆపాలంటూ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం ఎస్ఎఫ్ఐ నాయకుల ఆధ్వర్యంలో వారాసిగూడలోని పలు స్కూళ్ల వద్ద ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు జావిద్, అశోక్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠ్యపుస్తకాలకు స్టిక్కర్లు వేసి అధిక ధరల్లో అమ్ముతున్న ప్రైవేట్ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను కోరారు.