
టీచర్లతో ఆన్లైన్ క్లాస్‌లు, అడ్మిషన్ వర్క్స్
హైదరాబాద్, వెలుగు: సిటీలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు తెరుచుకున్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు మేనేజ్మెంట్లు 50 శాతం మంది టీచర్లను రప్పిస్తున్నాయి. సగం శాలరీనే చెల్లించేలా ముందే అగ్రిమెంట్ చేసుకుంటున్నాయి. నెలలుగా ఉపాధి లేక ఇళ్లకే పరిమితమవడంతో టీచర్లూ ఓకే చెప్తున్నారు. స్కూల్‌కి వస్తున్న టీచర్లు ఆన్లైన్ క్లాసులు, అడ్మిషన్ కు సంబంధించిన పనులు చూసుకుంటున్నారు. లాక్డౌన్ కారణంగా స్టూడెంట్స్ నుంచి ఫీజు వసూలు రాలేదని, టీచర్లతోనూ హాఫ్ డే మాత్రమే వర్క్ చేయిస్తున్నందున సగం జీతం ఇవ్వాలనుకుంటున్నామని పలు మేనేజ్మెంట్లు తెలిపాయి. మరోవైపు బస్తీలు, కాలనీల్లోని బడ్జెట్ ప్రైవేట్స్కూల్స్రీ ఓపెన్ అవలేదు. స్టూడెంట్స్ నెలనెలా ఇచ్చే తక్కువ ఫీజులతో నడిచే ఈ స్కూళ్లు ఇప్పట్లో తెరుచుకోవడం కష్టంగా కనిపిస్తోంది. కొన్ని స్కూళ్లు మాత్రం తమ స్టూడెంట్స్వేరే స్కూల్‌కి వెళ్లకుండా కాపాడుకునేందుకు నలుగురైదురు టీచర్లను నియమించుకుని మొబైల్ యాప్ ద్వారా ఫ్రీ ఆన్లైన్క్లాస్లు కండక్ట్ చేస్తున్నాయి.
ఏజెన్సీలతో నడిపిస్తున్నరు
కొన్ని ప్రైవేట్ స్కూల్మేనేజ్మెంట్లు పూర్తిస్థాయిలో టీచర్లను విధుల్లోకి తీసుకోవడం లేదు. ఏజెన్సీల ద్వారా ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. లాక్‌డౌన్‌తో ఆరు నెలల నుంచి ఉపాధి కోల్పోయిన టీచర్లను మొత్తానికే తొలగించి రోడ్డున పడేయొద్దు.
– షేక్ షబ్బీర్ అలీ, తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు
తిరిగి తీసుకోవాలె
లాక్డౌన్ నుంచి జీతం లేక నానా ఇబ్బందులు పడుతున్నాం. స్కూల్స్ రీ ఓపెన్ అయితే మళ్లీ ఉపాధి దొరకుతుందనుకున్నాం. కానీ, ప్రైవేట్ స్కూళ్లు చాలామంది టీచర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవడం లేదు.
-లక్ష్మి, ప్రైవేట్ టీచర్, మూసాపేట
For More News..