ఫెడరల్ బ్యాంక్ నుంచి ఫేషియల్ పేమెంట్స్​ సిస్టం

ఫెడరల్ బ్యాంక్ నుంచి ఫేషియల్  పేమెంట్స్​ సిస్టం

హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్ రంగ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ స్మైల్ పే ప్రారంభించింది. ఈ టెక్నాలజీ వల్ల వినియోగదారులు తమ ముఖాన్ని మాత్రమే ఉపయోగించి లావాదేవీలను పూర్తి చేస్తారు.  రిలయన్స్ రిటైల్, అనన్య బిర్లా స్వతంత్ర మైక్రో హౌసింగ్ ఫైనాన్స్ (ఎస్ఎంహెచ్ఎఫ్) ఔట్​లెట్లలో ఈ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా వాడతారు. యూఐడీఏఐ  ఆధార్ పే ఆధారంగా రూపొందించిన భీమ్ ఫేషియల్ ​వెరిఫికేషన్​టెక్నాలజీతో స్మైల్ పే పనిచేస్తుంది.

 అంటే కస్టమర్​ తన ముఖాన్ని కెమెరాకు చూపించగానే చెల్లింపు పూర్తవుతుంది.  సంప్రదాయ పద్ధతిలో యూపీఐ పిన్​నంబర్​ను ఎంటర్​ చేయాల్సిన అవసరం ఉండదు.   కస్టమర్లు నగదు, కార్డులు లేదా మొబైల్ పరికరాలను తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా లావాదేవీలను పూర్తి చేయవచ్చు. స్మైల్​పే సురక్షితమైన యూఐడీఏఐ అథెంటికేషన్ ఫేస్ సర్వీస్ ద్వారా పనిచేస్తుంది. ఇది సురక్షితమైన, విశ్వసనీయమైన లావాదేవీలను అందిస్తుందని ఫెడరల్​బ్యాంక్​ తెలిపింది.