బ్రెయిన్ స్ట్రోక్ తో ప్రైవేట్ టీచర్ మృతి.. ఇంట్లోకి తీసుకురావద్దని అడ్డుకున్న ఇంటి ఓనర్

బ్రెయిన్ స్ట్రోక్ తో ప్రైవేట్ టీచర్ మృతి.. ఇంట్లోకి తీసుకురావద్దని అడ్డుకున్న ఇంటి ఓనర్

కల్లూరు, వెలుగు :  కిరాయికి ఉంటున్న ప్రైవేట్ స్కూట్ టీచర్ డెడ్ బాడీని ఇంట్లోని తీసుకురావద్దంటూ యజమాని అడ్డుకున్నారు. దీంతో చర్చి ముందు టెంట్ వేసి ఉంచిన అనంతరం అంత్యక్రియలు పూర్తి చేసిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్లే.. చెన్నై నుంచి కల్లూరుకు 30  ఏండ్ల కింద గార్నెట్ అనే వ్యక్తి వచ్చాడు. కల్లూరులో కుటుంబంతో కిరాయి ఇంట్లో ఉంటున్నాడు. పలు ప్రైవేట్ స్కూళ్లలో ఇంగ్లీషు టీచర్ గా పనిచేస్తూ విద్యార్థుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.  ప్రస్తుతం బాలాజీ హై స్కూల్ లో   పని చేస్తున్న గార్నెట్ కు  బ్రెయిన్ స్ట్రోక్ రాగా.. మూడు రోజుల కింద కుటుంబసభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్సపొందుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందారు. 

డెడ్ బాడీని అతడు ఉండే కిరాయి ఇంటికి తీసుకెళ్లగా.. ఇంటి యజమాని తీసుకురావద్దంటూ అడ్డుకొన్నారు. స్థానిక అంబేద్కర్ నగర్ వాసులు మానవతా దృక్పథంతో స్పందించారు.  క్రీస్తు రాజు చర్చి ఆవరణలో టెంటు వేసి గార్నెట్ డెడ్ బాడీని  ఉంచారు.  పేద కుటుంబం కావడంతో  వైద్య ఖర్చులకు కూడా  డబ్బులు లేక ఇబ్బంది పడుతుండగా.. స్కూల్ మేనేజ్ మెంట్ తో పాటు విద్యార్థులు, సహచర ఉపాధ్యాయులు, మిత్రులు ఆర్థికంగా సాయం చేశారు. గార్నెట్ డెడ్ బాడీకి అంత్యక్రియలు నిర్వహించారు.