జీడిమెట్ల, వెలుగు: బెట్టింగ్‌లకు అప్పులు చేసిన ఓ టీచర్ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పేట్‌బషీరాబాద్ పోలీసులు తెలిపిన ప్రకారం.. మెదక్ జిల్లా పాపన్నపేట్మండలం పోచంపల్లికి చెందిన కమ్మరి మహిపాల్(39) కుత్బుల్లాపూర్ భాగ్యలక్ష్మికాలనీలో ఉంటూ ప్రైవేట్ టీచర్ గా చేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు సంతానం. మహిపాల్ కు బెట్టింగ్ లు ఆడే అలవాటు ఉంది. దీంతో అప్పుల పాలయ్యాడు. అంతేకాకుండా వారం రోజుల కింద స్కూటీ నడుపుతూ నాలుగేండ్ల బాలుడిని ఢీకొట్టాడు. దీంతో భయపడిన అతడు సొంతూరు వెళ్లాడు.
అనంతరం బాలుడి వైద్య ఖర్చులకు డబ్బులు ఇద్దామనుకుని తిరిగి సిటీకి వచ్చాడు. ఓ వైపు అప్పుల పాలవడం, మరోవైపు యాక్సిడెంట్ చేసిన కారణంగా మనస్తాపానికి గురయ్యాడు. గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.