
గుజరాత్‌లోని అమ్రేలిలో ప్రైవేట్ శిక్షణ విమానం కూలిపోయింది. మంగళవారం (ఏప్రిల్ 22) జరిగిన ఈ ప్రమాదంలో పైలట్ అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదం సమయంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
Also Read : జమ్ముూకాశ్మీర్ లో ఉగ్రదాడి.. ఆరుగురు టూరిస్టులకు గాయాలు
ఆమ్రేలిలోని విజన్ ఫ్లయింగ్ ఇన్స్టిట్యూట్ కు చెందిన శిక్షణ విమానం మంగళవారం శాస్త్రి నగర్ ప్రాంతంలో కూలిపోయింది. ఆ విమానం నడుపుతున్న పైలట్ అనికేత్ మహాజన్ మృతిచెందారరి డిప్యూటీ ఎస్పీ చిరాగ్ దేశాయ్ తెలిపారు.గత నెలలో గుజరాత్‌లో జరిగిన శిక్షణా విమాన కూలిన తర్వాత జరిగిన రెండో సంఘటన ఇది. మార్చిలో మెహ్సానా జిల్లాలోని ఒక గ్రామ శివార్లలో పాఠశాల మీదుగా ఎగిరిన శిక్షణా విమానం కూలిపోయింది.