ఆర్టీసి బస్సును ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు..పుష్ప 2 మూవీ ఆర్టిస్టులకు గాయాలు

నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి వద్ద ఆర్టీసీ బస్సును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ లో ప్రయాణం చేస్తున్న పలువురు పుష్ప 2 మూవీ ఆర్టిస్టులకు స్వల్ప గాయాలయ్యాయి. షూటింగ్ ముగించుకుని ఆర్టిస్టులు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో హైదరాబాద్, విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ జామ్ అయ్యింది.