
తెలుగు రాష్ట్రాల్లో ఉగాది సంబరాలు మొదలైన వేళ.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాక్సిడెంట్ కు గురికావడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం (మార్చి 30) తెల్లవారు జామున బెంగళూర్ హైవేపై ఈ ప్రమాదం జరగటంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు బైపాస్ జాతీయ రహదారిపై జరిగింది ప్రమాదం. కడప జిల్లా బద్వేల్ నుండి వస్తున్న BCVR ట్రావెల్స్ కు చెందిన ఓల్వా బస్సు ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి బలంగా ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న లారీ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనకాలే ఉన్న బస్సు ఢీకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తో పాటు పది మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను శంషాబాద్ హాస్పటల్ కు తరలించారు. బస్సు క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ను పోలీసులు చాలా సేపు శ్రమించి.. క్రేన్, వెల్డింగ్ కట్టర్ల సహాయంతో బస్సు ప్రైమ్ ను తొలగించి వెలికి తీశారు.