రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఢీ కొన్న ఘటన నిజామాబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెర్కిట్ 44వ జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి ఛత్తీస్ఘడ్ వెళ్తున్న బస్సును.,.. అటు వైపే వెళ్తున్న మరో బస్సు వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు, డ్రైవర్ కు గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.