ఎవరి మేలు కోసం ప్రైవేటు వర్సిటీలు..?

రాష్ట్రంలోని యూనివర్సిటీలను ఆరేండ్లుగా కేసీఆర్​ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఉస్మానియా, జేఎన్​టీయూ, కాకతీయ వంటి వర్సిటీలన్నీ ఇప్పుడు నిధులు, నియామకాలు లేక నిర్వీర్యమైపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒక విజన్ తో తగిన బడ్జెట్ కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పిస్తే ప్రపంచ స్థాయి వర్సిటీలతో పోటీ పడే సత్తా తెలంగాణ యూనివర్సిటీలకు ఉంది. పేదరికం నుంచి వచ్చిన లక్షలాది మంది గ్రామీణ విద్యార్థులు ఈ యూనివర్సిటీల్లో చదువుకుని విభిన్న రంగాల్లో రాణిస్తూ ప్రపంచ దేశాల్లో అపారమైన పేరు ప్రతిష్టలు సంపాదించారు. కానీ ఇప్పటి పాలకులు యూనివర్సిటీలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారుస్తున్నారు.

కేజీ నుంచి పీజీ వరకు విద్యను అందరికీ ఉచితంగా అందిస్తామని ప్రకటించిన టీఆర్ఎస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంగతే మర్చిపోయింది. పైగా యూనివర్సిటీ విద్యను ఉచితంగా అందించాల్సిన నైతిక బాధ్యత నుంచి కూడా ప్రభుత్వం తప్పుకుంటోంది. కార్పొరేట్ శక్తుల కమీషన్లకు ఆశపడి విచ్చలవిడిగా ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు అనుమతులిస్తోంది. కార్పొరేట్ వ్యక్తుల మెప్పు కోసం అసెంబ్లీలో ఏకపక్షంగా బిల్లును ఆమోదింప చేసుకున్నారు. ఆ చట్టాన్ని కూడా రోజురోజుకూ సవరిస్తూ జీవోలు జారీ చేస్తున్నది.

నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు నిర్ణయించామని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. కానీ నాణ్యమైన విద్యను అందించే ఒక్క అంతర్జాతీయ ప్రైవేట్ వర్సిటీకీ పర్మిషన్ ఇవ్వలేదు. ప్రభుత్వంలో మంత్రులుగా, ఎమ్మెల్సీలుగా ఉన్న వారికి సంబంధించిన కాలేజీలకే అనుమతులు ఇచ్చారు. వీటికి విద్యను వ్యాపారం చేయడమే లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాల కోసం కార్పొరేట్ శక్తులకు యూనివర్సిటీ విద్యను అప్పజెబుతోంది. ఈ విద్యార్థి వ్యతిరేక విధానాలపై పోరాటం చేయకుంటే భవిష్యత్​లో యూనివర్సిటీ విద్య పేదలకు అందని ద్రాక్షే అవుతుంది.-ఎన్.ఆర్.శంకర్, ఏఐఎస్ఎఫ్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ.

for more News…

హైదరాబాద్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

ఆ ఊరిలో అమ్మాయి పుడితే 5వేలు డిపాజిట్.. పెద్దయ్యాక ఊరోళ్లే పెళ్లి కూడా చేేస్తారు

చిన్న పట్టణాల్లో ఉద్యోగాలిస్తాం-బీపీఓ కంపెనీలు

గుడ్లు ఫ్రిజ్​లో స్టోర్​ చేస్తే డేంజర్

వ్యాక్సిన్ పంపిణీకి మెకానిజం రెడీ చేయండి