- స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరిస్తే సహించేది లేదని స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ హె చ్చరించింది. గురువారం సదరన్ డిస్కం కార్పొ రేట్ఆఫీస్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పవర్ జేఏసీ చైర్మన్ సాయిబాబా మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో నైనా విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరిస్తే ఆ రాష్ట్రాల ఉద్యోగులకు తాము మద్దతు తెలుపుతూ ఆందోళన చేస్తామని తెలిపారు. ‘నేషనల్ కో -ఆర్డినేషన్ కమిటీ అఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజినీర్స్’ పిలుపు మేరకు విద్యుత్ సంస్థలను ఉత్తరప్రదేశ్, చండీగఢ్ ప్రైవేటు పరం చేయాలని భావిస్తున్నాయని..ఈ ప్రయత్నాన్ని తప్పకుండా అడ్డుకుంటామని అన్నారు.