ఎన్​ఆర్​ఐ సీనియర్​ సిటిజన్ల కోసం ప్రియా లివింగ్

ఎన్​ఆర్​ఐ సీనియర్​ సిటిజన్ల కోసం ప్రియా లివింగ్

హైదరాబాద్​, వెలుగు: ఎన్​ఆర్​ఐ సీనియర్​ సిటిజన్లకు లగ్జరీ వసతి సౌకర్యం అందించడానికి ఏర్పాటు చేసిన ప్రియా లివింగ్ హైదరాబాద్​లో ప్రారంభమైంది. ఇక్కడ 127 అపార్ట్​మెంట్లు ఉంటాయి. వీటిలో 2,3,4 పడక గదులు ఉంటాయి. సీనియర్ ​సిటిజన్లు ఇక్కడి నుంచే బిజినెస్​ను నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేశామని ప్రియా లివింగ్​ఫౌండర్​ అరుణ్​ పాల్​ చెప్పారు.

‘‘వృద్ధులు తమ పాత అభిరుచులను తిరిగి మొదలుపెట్టవచ్చు. కొత్త విషయాలను నేర్చుకోవచ్చు.  ఆహ్లాదం పంచే స్థలాలు, ప్రపంచస్థాయి సేవలు, సౌకర్యాలు మా ప్రత్యేకతలు”అని ఆయన వివరించారు. ఢిల్లీతోపాటు అహ్మదాబాద్​లో ఇట్లాంటి ప్రాజెక్టులు చేపట్టామన్నారు. చెన్నై, గోవా, రిషికేష్​, కాశీ, బరోడాలోనూ ప్రాపర్టీలను ప్రారంభిస్తామని అన్నారు. మనదేశంలో కార్యకలాపాల కోసం వంద మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తామని చెప్పారు.