![యంగ్ బ్యూటీకి ఫ్యాన్స్ అండ](https://static.v6velugu.com/uploads/2023/06/Priya-Prakash-Warrier-latest-photos_6AKcoFdyU1.jpg)
‘ఒరు అడార్ లవ్’ సినిమాతో సెన్సేషన్‌గా మారింది ప్రియా ప్రకాశ్ వారియర్. ఆమె కన్ను గీటిన స్టైల్‌కి కుర్రకారు ఫిదా అయిపోయారు. అలా వచ్చిన క్రేజ్‌తో తెలుగులోనూ ఇష్క్, చెక్ అనే సినిమాలు చేసింది. వాటి రిజల్ట్ చూసి ఇక బాలీవుడ్‌కి చెక్కేయడమే నయమనుకుందేమో! ప్రస్తుతం బీటౌన్‌లో చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఇక ఫొటో షూట్లతో హీట్ పెంచుతున్న ఈ బ్యూటీ తాజాగా నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
చుడిదార్‌లో దిగిన ఫొటోలను పోస్ట్ చేయగా అవి వైరల్‌గా మారాయి. ఇందులో ప్రియా తెల్లజుట్టుతో కనిపించింది. నీకు అప్పుడే తెల్లజుట్టు వచ్చేసిందంటూ కొందరు ఈ ఫొటోలకు కామెంట్లు చేస్తున్నారు. ప్రియా ఫ్యాన్స్ మాత్రం ఇలాంటి ఫొటోలు ఫిల్టర్ లేకుండా పోస్ట్ చేయడం చాలా గొప్ప విషయమంటూ ఆమెను ఆకాశానికెత్తేస్తున్నారు. ఈ రోజుల్లో తెల్ల జుట్టుకు వయసుతో సంబంధం ఉండటం లేదంటూ ప్రియాకు సపోర్ట్ చేస్తున్నారు.