Priyadarshi: జెట్ స్పీడ్లో దూసుకుపోతున్న హీరో ప్రియదర్శి..మరో కామెడీ మూవీ ఫినిష్

నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుని సపోర్టింగ్ క్యారెక్టర్స్‌‎తో పాటు హీరోగానూ బిజీ అవుతున్నాడు ప్రియదర్శి(Priyadarshi). ఇటీవల ‘డార్లింగ్’ చిత్రంలో లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చేసి మెప్పించిన తను..హీరోగా మరో సినిమాలో నటిస్తున్నాడు. ఇంద్రగంటి మోహన కృష్ణ (Mohan Krishna Indraganti)  దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా సారంగపాణి జాతకం (Sarangapani Jathakam) అనే టైటిల్ తో మూవీ తెరకెక్కింది.శ్రీదేవి మూవీస్ బ్యానర్‌‎‌‌పై శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఇంద్రగంటి మోహన కృష్ణ శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో ఇది వరకు జెంటిల్మన్, సమ్మోహనం సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు మూడో చిత్రంగా సారంగపాణి జాతకం తెరకెక్కింది. ఐదు షెడ్యూల్స్ లో జెట్ స్పీడ్ లో మూవీ షూటింగ్ మొత్తం ఫినిష్ చేసారంట మేకర్స్.

ఈ సందర్బంగా 'ఆ విధంగా...షూటింగ్ సంపూర్ణం'అని ప్రకటిస్తూ వీడియో రిలీజ్ చేశారు. మూవీని హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లో ఐదు షెడ్యూల్స్ లో కంప్లీట్ చేసినట్లు నిర్మాత స్పష్టం చేశారు. సెప్టెంబర్ 12 నుంచి ఈ మూవీ డబ్బింగ్ పనులు మొదలు కాబోతున్నాయని మేకర్స్ తెలిపారు. త్వరలో రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. 

‘ఇదొక మధ్య తరగతి మంచి అబ్బాయి కథ. మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా..? లేదా అతను చేసే చేతల్లో ఉంటుందా..? అనే ప్రశ్నకు జవాబు ఇచ్చే ఎంటర్‌‎‌‌టైనర్. జంధ్యాల గారి తరహా పూర్తి వినోదాత్మక సినిమా ఇది. రూప కడువయూర్ హీరోయిన్‌‌‌‌‌‌‎గా నటిస్తోంది. వెన్నెల కిశోర్, వైవా హర్ష, నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల ఇతర పాత్రలు పోషిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.