Darling Theatrical Rights : డార్లింగ్తో నిరంజన్ రెడ్డికి జాక్ పాట్..రిలీజ్కు ముందే నిర్మాతకు కోట్లలో లాభాలు!

Darling Theatrical Rights : డార్లింగ్తో నిరంజన్ రెడ్డికి జాక్ పాట్..రిలీజ్కు ముందే నిర్మాతకు కోట్లలో లాభాలు!

విభిన్న చిత్రాల హీరోగా ప్రియదర్శి గుర్తింపు పొందాడు. దర్శి హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ డార్లింగ్ (Darling). ఈ మూవీ శుక్రవారం జూలై 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో నేటి వరకు డార్లింగ్ మూవీ మేకర్స్ వరుస ప్రమోషన్స్ తో హైప్ ఎక్కించేశారు. కంటెంట్ పై ఉన్న నమ్మకంతో నేడు గురువారం సాయంత్రం 6:30 గంటలకుపెయిడ్ ప్రీమియర్స్ కూడా వేయనున్నారు.

తాజా సమాచారం ప్రకారం..ఫన్,లవ్,ఫ్యామిలీ డ్రామా,థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్న కంప్లీట్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్ గా వస్తున్న డార్లింగ్ రిలీజ్ కు ముందుగానే లాభాల బాటలో చేరిందని సమాచారం.ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి ప్రైమ్ షో బ్యానర్ మీద దాదాపు రూ.8 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం నాన్ థియేట్రికల్ రైట్స్  మంచి అమౌంట్ కే అమ్ముడయ్యాయని తెలుస్తోంది.  

ఇక వివరాల్లోకి వెళితే..డార్లింగ్ మూవీ రిలీజ్ కు ముందే టేబుల్ ప్రాఫిట్ సాధించడం విశేషం. థియేట్రికల్ హక్కులు 7 కోట్ల రూపాయలకు విక్రయించబడగా, నాన్-థియేట్రికల్ హక్కులు 8 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. మొత్తంగా ఈ మూవీ రూ.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌తో నిర్మాతలు మంచి లాభాలను పొందారు.

ఈ మూవీ నైజాం థియేట్రికల్ రైట్స్ను ప్రముఖ బడా మైత్రి మూవీస్ రూ3 కోట్లు, ఆంధ్ర రైట్స్ ఏషియాన్, సురేష్ సంస్థలు సంయుక్తంగా రూ.4 కోట్ల మేరకు కొనుగోలు చేసాయి. దీంతో డార్లింగ్ కు సంబంధించిన అన్ని అమ్మకాలు కంప్లీట్ అవ్వగా..నిర్మాత నిరంజన్ రెడ్డికి రూ.6కోట్లు వరకు లాభాలు తెచ్చిపెటిందని సినీ సర్కిల్ టాక్ వినిపిస్తోంది.దీన్ని బట్టి చూస్తే డార్లింగ్ సినిమానిర్మించిన నిరంజన్ చాలా లక్కీ మ్యాన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే, ఈ మధ్య కాలంలో రిలీజ్ కు ముందే లాభాలు రావడం..ప్రతి చోట అమ్ముడుపోవడం అంటే మాములు విషయం కాదు.ఇక ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో రిలీజ్ అయ్యాక ఎలాంటి వసూళ్లు రాబట్టుకుంటుందో అర్ధమవుతుంది. ఇటీవలే హనుమాన్ సినిమాతో దాదాపు రూ.100 కోట్లు మేరకు లాభాల్లో ఉంచింది. ఇక డార్లింగ్ సినిమాతో మరోసారి నిరంజన్ లాభాల్లో చేరిపోయాడు. 

ఇకపోతే పూరి,రామ్ల డబల్ ఇస్మార్ట్ ఆల్ ఇండియా థియేట్రీకల్ రైట్స్ ను ఏకంగా రూ.54 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం.హిందీ వెర్షన్ హక్కులు కాకుండా మిగతా భాషల హక్కుల కోసం ఇంత మొత్తం చెల్లిస్తోంది. అయితే, మొత్తం బిజినెస్ రూ.60 కోట్లు కాగా..ఇందులో రూ.6 కోట్లు రికవరబుల్ అడ్వాన్స్, రూ.54 కోట్లు నాన్ రికవరబుల్ అడ్వాన్స్ గా ఉంది. ఈ సినిమా కూడా హిట్ అయితే నిరంజన్ రెడ్డికి మరో గిట్టుబాటుసినిమా పడ్డట్టే అన్నమాట. డీసెంట్ మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ మ్యూజిక్ అందించనున్న డార్లింగ్ సినిమాలో అనన్య నాగళ్ళ, మురళీధర్ గౌడ్, శివ రెడ్డి మరియు కృష్ణ తేజ వంటి తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.