Sarangapani Jathakam: సారంగపాణి జాతకం ఫస్ట్ డే వసూళ్లు ఇంత తక్కువా.. అసలు సినిమా కథేంటీ?

Sarangapani Jathakam: సారంగపాణి జాతకం ఫస్ట్ డే వసూళ్లు ఇంత తక్కువా.. అసలు సినిమా కథేంటీ?

‘కోర్ట్‌‌’మూవీతో సూపర్ హిట్ అందుకున్న ప్రియదర్శి నటించిన లేటెస్ట్ మూవీ 'సారంగపాణి జాతకం'. ఈ మూవీ శుక్రవారం ఏప్రిల్ 25న థియేటర్స్ లో రిలీజైంది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ కామెడీ థ్రిల్ల‌ర్ ఆశించిన స్థాయిలో వసూళ్లు దక్కించుకోలేదు.

సినిమా రిలీజయ్యాక వచ్చిన మిక్సెడ్ రివ్యూలు, కథనంలో కొత్తదనం లేకపోవడంతో ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. దాంతో ఈ సినిమా తొలిరోజు బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించలేకపోయింది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. సారంగపాణి జాతకం మూవీ ఫస్ట్ డే కేవలం కోటి రూపాయలు గ్రాస్ మాత్రమే వసూలు చేసినట్లు సమాచారం. ఈ సినిమాకు తొలిరోజు రూ.0.50 లక్షల నెట్ వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే, మేకర్స్ నుంచి ఫస్ట్ డే గ్రాస్ వసూళ్లపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాకు మేకర్స్ సుమారుగా రూ.5కోట్లు ఖర్చుపెట్టినట్లు సమాచారం.

సారంగపాణి జాతకం మూవీఆక్యుపెన్సీ కూడా  తక్కువగా నమోదు చేసుకుంది. సారంగపాణి జాతకం శుక్రవారం నాడు మొత్తం 12.56% తెలుగు ఆక్యుపెన్సీని కలిగి ఉంది. మార్నింగ్ షోలు (10.86%), మధ్యాహ్నం షోలు (14.00%), సాయంత్రం షోలు(11.56%), రాత్రి 13.81%  ఆక్యుపెన్సీ ఉన్నాయి. 

ప్రియదర్శి రీసెంట్ కోర్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ చూసి ఇండస్ట్రీ అంతా షాక్ అయింది. కోర్ట్ మూవీ దాదాపుగా ప్రీమియర్స్తో కలుపుకుని రూ.8.10 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసింది. దాంతో సారంగపాణి జాతకం మూవీపై కూడా భారీ అంచనాలే ఏర్పడ్డాయి. కానీ, ఈ తొలిరోజు వసూళ్లు మేకర్స్ని బాగా నిరాశపరిచాయి.

Also Read:-పహల్గాం ఉగ్రదాడి.. జమ్మూ కాశ్మీర్‌లో తెలుగు సినిమాల షూటింగులు రద్దు!

అయితే, ప్రస్తుత పరిస్థితిపై ప్రియదర్శి మాట్లాడుతూ.. 'ప్రతి షో గడిచేకొద్దీ మౌత్ టాక్ మెల్లగా మెరుగుపడుతుందని, ప్రేక్షకుల్లోకి లోతుగా వెళ్లిన తర్వాత, ఈ కామెడీ సినిమా బాక్సాఫీస్ వద్ద మరింత ఆదరణ పొందుతుందని' అన్నారు. శ్రీదేవి మూవీస్ ఈ సినిమాను నిర్మించగా, వివేక్ సాగర్ సంగీతం అందించారు.

ఇందులో జాత‌కాల పిచ్చి ఉన్న యువ‌కుడిగా ప్రియ‌ద‌ర్శి త‌న కామెడీ టైమింగ్‌తో న‌వ్వించాడు. కానీ, దర్శకుడు ఎంచుకున్న కథనంలో అసలైన బలం లేదంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మరి ఈ వీకెండ్ లో ఎలాంటి టాక్ తో ముందుకెలుతుందో చూడాలి. 

కథేంటంటే:

సారంగపాణి (ప్రియదర్శి) ఒక కార్ షోరూమ్లో సేల్స్ మాన్గా పనిచేస్తుంటాడు. అతనికి జాతకాల పిచ్చి. మూఢ నమ్మకాలను వీపరీతంగా నమ్మేస్తూ బ్రతుకుతాడు. చేతిరాతలే తన జీవితరాత అని ఉహించుకుంటాడు. ఉదయం లేచిన దగ్గరనుండి పడుకునే వరకు చేసే ప్రతి పనిని జాతకం చూసుకునే చేస్తుంటాడు.

ఈ క్రమంలో త‌న షోరూమ్‌లోనే మేనేజ‌ర్‌గా ప‌నిచేసే మైథ‌లిని (రూప కొడ‌వాయూర్‌) ఇష్ట‌ప‌డ‌తాడు. మైథిలి కూడా సారంగ‌పాణిని ప్రేమిస్తుంది. పెద్ద‌ల‌ను ఒప్పించి మైథిలితో ఏడ‌డుగులు వేయాల‌ని సారంగ‌పాణి అనుకుంటాడు. ఎంగేజ్‌మెంట్ జ‌రుగుతుంది.

ఆ టైంలోనే సారంగపాణి జీవితంకి ఓ వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు. ఆస్ట్రాల‌జ‌ర్ జిగేశ్వ‌నంద్ (శ్రీనివాస్ అవ‌స‌రాల‌)తో సారంగపాణితో పరిచయం ఏర్పడుతుంది. ఆస్ట్రాల‌జ‌ర్ జిగేశ్వ‌నంద్ చెప్పే ప్రతిమాటను సారంగపాణి తూచా తప్పకుండ పాటిస్తుంటాడు. అయితే, పెళ్లయ్యాక ఓ అనుకోని మర్డర్ కేసులో ఇరుక్కుంటావు అంటూ ముందే జాతకం చెప్పుతాడు ఆ ఆస్ట్రాల‌జ‌ర్ జిగేశ్వ‌నంద్.

ఇక పెళ్లయ్యాక  హంత‌కుడి భార్య అనే ముద్ర 'తాను పెళ్లి చేసుకోబోతున్న మైథిలిపై' ప‌డ‌కూడ‌ద‌ని ఆలోచిస్తాడు. అలా ముందే ఓ వ్యక్తిని మర్డర్ చేయడానికి డిసైడ్ అవుతాడు. అందుకు తన ఫ్రెండ్ చందు (వెన్నెల కిశోర్) సాయం తీసుకుంటాడు. తాను మర్డర్ చేయాలి, కానీ చనిపోయిన వారి వల్ల సమాజానికి గానీ, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకూడదని భావిస్తాడు.

అయితే, ఒక ఫేమస్ హోటల్ ఓనర్ అహోబిల రావు (తనికెళ్ల భరణి)ని చంపమని జిగేస్వరానంద్ సలహా ఇస్తాడు.  మరి  అహోబిల‌రావును (త‌నికెళ్ల భ‌ర‌ణి) చంప‌మ‌ని సారంగ‌పాణికి జిగేశ్వ‌ర‌నంద్ ఎందుకు చెప్పాల్సి వస్తుంది? చివరికి సారంగపాణి అతన్ని చంపడా? లేదా? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? జాత‌కాల పిచ్చి కార‌ణంగా సారంగ‌పాణి జీవితంలో ఎలాంటి క‌ష్టాల‌ను ఎద‌ర్కొన్నాడనేది మిగతా స్టోరీ.