NMDC బోర్డు డైరెక్టర్ (పర్సనల్)గా ప్రియదర్శిని గడ్డం

NMDC బోర్డు డైరెక్టర్ (పర్సనల్)గా ప్రియదర్శిని గడ్డం

నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NMDC) డైరెక్టర్ (పర్సనల్)గా ప్రియదర్శిని గడ్డం నియమితులయ్యారు. శుక్రవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ నియామకంతో ప్రియదర్శిని గడ్డం NMDC మొట్టమొదటి మహిళా ఫంక్షనల్ డైరెక్టర్‌గా చరిత్ర సృష్టించారు. ఆమె జనవరి 31, 2026 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు.

1992లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా NMDCలో చేరిన ప్రియదర్శిని ఒక్కో మెట్టు ఎక్కుతూ నాయకురాలిగా ఎదిగారు. మైనింగ్ పరిశ్రమలో నాయకత్వ పాత్రల్లో మరింత మహిళలు ఉండటానికి మార్గం సుగమం చేశారు. సంస్థలో మంచి పేరు, మూడు దశాబ్దాలకుపైగా అనుభవం ఆమె సొంతం. 

ఈ నియామకానికి ముందు ఆమె హైదరాబాద్‌లోని NMDC కార్పొరేట్ కార్యాలయం, నాగర్నార్‌లోని NMDC స్టీల్ లిమిటెడ్ రెండింటికీ చీఫ్ జనరల్ మేనేజర్(పర్సనల్ & అడ్మినిస్ట్రేషన్)గా బాధ్యతలు నిర్వహించారు.

ప్రియదర్శిని గడ్డం హైదరాబాద్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వపు విద్యార్థి. ఎల్‌ఎల్‌బితో పాటు సోషల్ వర్క్(పర్సనల్ మేనేజ్‌మెంట్ మరియు ఇండస్ట్రియల్ రిలేషన్స్)లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పట్టా పొందారు.