
నటనకి ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలే కాక గ్లామర్ రోల్స్ కూడా చేసి రెండింట్లోనూ బెస్ట్ అనిపించుకుంది ప్రియమణి. ఈసారి మాత్రం తన ఇమేజ్‌కి పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించబోతోంది. ‘కొటేషన్ గ్యాంగ్’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో శకుంతల అనే కాంట్రాక్ట్ కిల్లర్‌గా నటిస్తోంది. సన్నీ లియోన్, జాకీ ష్రాప్, సారా కూడా కిల్లర్స్‌గా కనిపించనున్నారు. నిన్న ఈ నలుగురి ఫస్ట్ లుక్స్ విడుదల చేశారు. అందరూ డిఫరెంట్‌గానే కనిపిస్తున్నా ప్రియమణి లుక్ మాత్రం టెరిఫిక్‌గా ఉంది. ముఖం మీద గాయాలతో ఒక కన్ను మూసుకుపోయి, గట్టిగా అరుస్తూ భయపెడుతోంది. ఐదు వందల రూపాయల కోసం నాటు తుపాకితో మర్డర్‌లు చేసే ముఠా కథ ఇది. కేరళలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిస్తున్నాడు తమిళ దర్శకుడు వివేక్ కుమార్ కణ్ణన్. ఇటీవలే షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. గాయత్రీ సురేష్, కె.వివేక్, జి.వివేకానందన్ కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.