![Bhamakalapam 2 Glimpse: మీరు మాములు వైఫా..డేంజరస్ వైఫ్](https://static.v6velugu.com/uploads/2024/01/priyamani-bhamakalapam-2-glimpse-released_PI3HpkGiQl.jpg)
మొదట్లో హీరోయిన్లుగా వెలిగిన చాలామంది అవకాశాలు తగ్గాక..క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుంటారు. హీరోయిన్ ప్రియమణి (Priyamani) కూడా అదే చేసింది. అయితే మిగతా వారిలా కాకుండా ఇపుడు జెట్ స్పీడులో దూసుకెళ్తోంది. మంచి మంచి అవకాశాలు వెతుక్కుంటూ రావడంతో తన టాలెంట్‌ని గతంలో కంటే ఎక్కువగా ప్రూవ్ చేసుకునే చాన్స్ దొరుకుతోంది ప్రియమణికి. నారప్ప, భామాకలాపం, విరాటపర్వం, మొన్నటికి మొన్న వచ్చిన జవాన్ లోని పాత్రలే అందుకు ఉదాహరణ.
లేటెస్ట్గా ప్రియమణి తన హిట్ సినిమా భామాకలాపంకు సీక్వెల్గా తెరకెక్కుతున్న భామాకలాపం 2 (Bhamakalapam 2) గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్ ఆడియన్స్ను ఆకట్టుకునేలా ఉంది. ప్రియమణి అండ్ శరణ్య సస్పెన్స్ డైలాగ్స్‌తో ఆసక్తి పెంచేశారు మేకర్స్.
ప్రియమణి, శరణ్య ఇద్దరూ ఏదో దొంగతనానికి వెళ్తున్నట్లు చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. చెరో 25 లక్షలు. ఇద్దరికి కలిపి 50 లక్షలు. మనం ఎన్ని ఇడ్లీలు అమ్మితే అంత డబ్బు వస్తుంది అని శరణ్య చెప్పే డైలాగ్ భామాకలాపం 2 పై అంచనాలు పెంచుతోంది. అసలు మనం చేస్తుంది కరెక్టేనా అని ప్రియమణి అడిగితే..అసలు ఇది మొదలు పెట్టిందే మీరు కదా అక్క..మీరు మాములు వైఫా..డేంజరస్ వైఫ్ అని శరణ్య ఇంటెన్స్ గా డైలాగ్ చెప్పడం గ్లింప్స్ లో హైలెట్‌గా నిలిచింది.
గ్లింప్స్ చివర్లో మొహానికి మంకీ క్యాప్ పెట్టుకుని నడుచుకుంటూ రావడం..బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మిస్ అయిందని శరణ్య చెప్పడం నవ్వు తెప్పించేలా ఉంది. డేంజరస్ వైఫ్ త్వరలో వస్తుంది అంటూ వీడియోను పంచుకున్నారు మేకర్స్.
విజనరీ డైరెక్టర్ అభిమన్యు (Abhimanyu) తాడిమేటి తెరకెక్కించిన భామాకలాపం ఫిబ్రవరి 11న 2022లో ఆహా ఓటీటీలో రిలీజై ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం'ది మోస్ట్ డేంజరస్ వుమన్' థియేటర్స్లో రాబోతుందంటూ మేకర్స్ తెలియజేశారు.
ఆహా(Aha) స్టూడియోస్ సమర్పణలో డ్రీమ్ ఫార్మర్స్ బ్యానర్ పై బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సీరత్ కపూర్, శరణ్య, రఘు ముఖర్జీ, అనుజ్ గుర్‌వార్ మరియు బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.