అమరుల బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని.. రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని కలలు కన్న నిరుద్యోగుల ఆశలను బీఆర్ఎస్ ప్రభుత్వం నీరుగార్చిం దన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. పదేళ్లుగా బీఆర్ ఎస్ ప్రభుత్వం పాలిస్తోంది..ఈ పదేళ్లలో ఏం అభివృద్ధి చేసిందో ఒక్కసారి ఆలోచించాలని ప్రియాంక గాంధీ అన్నారు. కలలు కన్న తెలంగాణ సాకారం కాలేదు..ప్రత్యేక రాష్ట్రం వస్తే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని నమ్మారు..కానీ కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారని ప్రియాంక గాంధీ ఆరోపించారు. గద్వాల సభలో ప్రియాంకగాంధీ పాల్గొని ప్రసంగించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని మర్చిపోయింది..పదేళ్లుగా తెలంగాణలోఅభివృద్ది శూన్యమన్నారు ప్రియాంకగాంధీ. ఈ ప్రభుత్వం నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని జోస్యం చెప్పారు. ప్రత్యేక రాష్ట్రంలో పేదలే ఎక్కువగా నష్ట పోతున్నారని అన్నారు. కేసీఆర్ ఫ్యామిలీకి ఇన్ని ఆస్తులు ఎక్కడివి.. పదేళల్లో కేసీఆర్ కుటుంబం ఆస్తులు ఎంతగా పెరిగాయో చూస్తున్నారు. మరోవైపు దేశ సంపదను మోదీ.. అదానీకి పంచుతున్నారు.. ఇద్దరు ఇద్దరే అని.. కేసీఆర్ ను గద్దె దించేందుకు ఇదే సమయమన్నారు ప్రియాంక గాంధీ.
ఈ ప్రభుత్వం పేదలకు ఏం చేసిందో ఒక్కసారి ఆలోచించండి..కలలు కన్న తెలంగాణా సాకారం కాలేదు.. ప్రత్యేక తెలంగాణలో అన్ని వర్గాలకు మేలు జరుగు తుందని నమ్మితే మోసం చేశారని ప్రియాంక గాంధీ ఆరోపించారు. బీఆర్ స్ నేతలు చేసిన కబ్జాలు దేశంలో మరెక్కడా లేవని విమర్శించారు. పేదల జేబులు కొట్టి పెద్దలకు పంచుతున్నారని ప్రియాంక గాంధీ ఆరోపించారు.