భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని ఐదు నియోజకవర్గాలు, మండలాలకు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పినపాక నియోజకవర్గానికి అడిషనల్ కలెక్టర్, డీఆర్డీఏ పీడీ మధుసూదనరాజు, ఇల్లెందు నియోజకవర్గానికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జె. కాశయ్య, కొత్తగూడెంకు ఆర్డీఓ ఆర్.శిరీష, అశ్వారావుపేటకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె. మాధవి, భద్రాచలానికి ఆర్డీఓ ఎం. మంగిలాల్ స్పెషల్ ఆఫీసర్లుగా వ్యవహరించనున్నారని పేర్కొన్నారు.
నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులను వీరు పర్యవేక్షించనున్నారు. జిల్లాలోని 21 మండలాలకు జిల్లా స్థాయి ఆఫీసర్లను ప్రత్యేక అధికారులుగా నియమించినట్టు తెలిపారు. అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాల అమలు తీరును వీరు పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. మండల, నియోజకవర్గ స్థాయిలో వారం రోజులకోసారి నివేదికలు ఇవ్వాలని సూచించారు.