భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : గ్రీవెన్స్‌లో వచ్చిన దరఖాస్తులపై ఆఫీసర్లు దృష్టి సారించాలని కలెక్టర్ ప్రియాంక అల ఆదేశించారు.కలెక్టరేట్లో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు ఎంతో దూరం నుంచి తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆశతో వస్తుంటారని, సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దన్నారు.
ఈ ప్రోగ్రాంలో అడిషనల్ కలెక్టర్ మధుసూదనరాజు, డీఆర్ఓ రవీంద్రనాద్ పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సేవలందించిన జిల్లాగా భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఎంపిక కావడం ఆనందంగా ఉందని కలెక్టర్ అన్నారు. అవార్డ్‌ను డీఎంహెచ్ఓ డాక్టర్ శిరీషకు అందజేశారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా నుంచి ఉత్తమ ప్రతిభ కనపర్చినవైద్యులు, వైద్య సిబ్బందినిఆమె సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫిబ్రవరి 12వ తేదీన చేపట్టనున్న నులిపురుగుల దినోత్సవాన్ని విజయవంతం చేసే విధంగా ప్లాన్ చేయాలన్నారు.
పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి
పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కలెక్టర్ప్రియాంక అల సూచించారు. కలెక్టరేట్ నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2021 పట్టభద్రుల ఎన్నికల్లో 42,679 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారన్నారు. ఇప్పటి వరకు కేవలం 13,492 మంది మాత్రమే నమోదు చేసుకున్నారన్నారు. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి ఆరు చివరి తేదీ అన్నారు.