పోలింగ్ ​తక్కువగా ఉన్న ప్రాంతాలపై స్పెషల్ ​ఫోకస్: ప్రియాంక అల

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో గత ఎన్నికల్లో పోలింగ్​తక్కువగా ఉన్న ప్రాంతాలపై ఈసారి స్పెషల్​ ఫోకస్​ పెడుతున్నామని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ డాక్టర్​ ప్రియాంక అల చెప్పారు. కలెక్టరేట్​లో ఎస్పీ డాక్టర్​ వినీత్​తో కలిసి శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎన్నికల నోటిఫికేషన్​ను ఆమె రిలీజ్​ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఎన్నికల్లో164పోలింగ్​ కేంద్రాల పరిధిలో పోలింగ్​ శాతం తక్కువగా జరిగినట్టుగా గుర్తించామని, ఈ ఎన్నికల్లో పెంచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.

జిల్లాలో ఇప్పటి వరకు రూ. 4.81కోట్ల మేర నగదు, మద్యం, డ్రగ్స్​, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఎన్నికలకు సంబంధించి 1950 టోల్​ ఫ్రీ నంబర్​కు ద్వారా సమాచారం ఇవ్వాలని కోరారు. జిల్లాకు ఇద్దరు వ్యయ పరిశీలకులు​ గితేశ్​​ కుమార్​, సతీశ్​చంద్రలను ఎన్నికల సంఘం నియమించిందన్నారు.