భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: లోక్ సభ ఎన్నికల్లో నిర్వహిస్తున్న ట్రైనింగ్ కు అటెండ్ కాని ఉద్యోగులకు షోకాజ్ నోటీస్లు ఇవ్వాలని కలెక్టర్ డాక్టర్ ఎన్నికల పర్యవేక్షణాధికారులను ఆదేశించా రు కొత్తగూడెంలోని సింగరేణి ఉమెన్స్ కాలేజ్. లక్ష్మి దేవిపల్లి మండలంలోని శ్రీరామచంద్ర డిగ్రీ కాలేజ్ లో మొదటి దశలో భాగంగా పోలింగ్ సిబ్బందికి నిర్వహిస్తున్న ట్రైనింగ్ సెంటర్లను ఆమె సోమవారంపరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు గానూ 1,279 మంది పోలింగ్ సిబ్బంది అటెండ్ కావాల్సి ఉన్నప్పటి కీ 90మంది రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారందరికీ షోకాజ్ నోటీస్లు ఇవ్వాలన్నారు. ఈ ప్రోగ్రాంలో కొత్తగూడెం ఏఆ మరు, ఇల్లెందు ఎకారి కాశయ్య జిల్లా అధికారులు కుసుమకు మారి, అర్జున్, తహసీల్దారు రవి కుమార్, పుల్లయ్య, శిరీష పాల్గొన్నారు.