ప్రజాపాలన కు ఏర్పాట్లు చేయాలి : ప్రియాంక అల

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించనున్న ప్రజా పాలన ప్రోగ్రామ్​కు ఏర్పాట్లు చేయాలని జిల్లా ఆఫీసర్లను కలెక్టర్​ డాక్టర్​ ప్రియాంక అల ఆదేశించారు. జిల్లాలోని పలు శాఖల అధికారులు, మున్సిపల్​ కమిషనర్లు, స్పెషల్​ ఆఫీసర్లతో సోమవారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్​లో ఆమె మాట్లాడారు. మంగళవారం ఖమ్మం కలెక్టరేట్​లో జిల్లా ఇన్​చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజాపాలనపై రివ్యూ నిర్వహించనున్నారని తెలిపారు. 

ఉదయం 9.30 గంటలకు మీటింగ్​ ప్రారంభం కానున్నదని తెలిపారు. ఈ మీటింగ్​కు అడిషనల్​ కలెక్టర్లు, జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్​ కమిషనర్లు, డివిజన్​ స్థాయి ఆఫీసర్లు అటెండ్​ కావాలన్నారు. ప్రజా పాలన ప్రోగ్రాం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని చెప్పారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత స్కీమ్​లకు దరఖాస్తులు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్లు డాక్టర్​ పి. రాంబాబు, మధుసూదనరాజు, డీపీఓ రమాకాంత్​, జడ్పీ సీఈఓ విద్యాలతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.