భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి టెంపుల్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. టెంపుల్ డెవలప్మెంట్లో భాగంగా అవసరమైన భూ సేకరణకు నివేధికలను సిద్ధం చేసి మూడు రోజుల్లోపు అందజేయాలని ఆమె సూచించారు.
భూ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ద్వారా ఇవ్వాల్సిన అనుకూలమైన ల్యాండ్‌ను గుర్తించాలన్నారు. భద్రాచలం రామాలయం భూములకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసుల వివరాలను అందజేయాలని చెప్పారు. ఈ మీటింగ్‌లో ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్, అడిషనల్కలెక్టర్ వేణుగోపాల్, ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్, తహసీల్దార్శ్రీనివాస్, కొలతలు–సర్వే ఏడీ కుసుమకుమారి, డిప్యూటీ సీఈఓ చంద్రశేఖర్, కలెక్టరేట్ భూ సేకరణ సీనియర్అసిస్టెంట్యాసిన్ పాషా
పాల్గొన్నారు.
తాగు నీటి ఎద్దడి నివారణ చర్యలు
వేసవిలో గ్రామాల్లో తాగు నీటి సమస్య లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆళ్లపల్లి, పూసుకుంట, కరకగూడెం లాంటి మారుమూల గ్రామాల్లోనూ తాగునీటి ఎద్దడి ఉండకూడదన్నారు. 634 మంది ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలున్న వారికి బోర్లు వేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చామని చెప్పారు. బూర్గంపహడ్ మండలం సారపాకలో భాస్కర్ నగర్ రోడ్డుకు సంబంధించి ఫామ్ బి రిపోర్టు ఇవ్వాలని డీఎఫ్ఓను ఆదేశించారు.