గోపీచంద్ హీరోగా కన్నడ దర్శకుడు ఎ.హర్ష డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘భీమా’. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీచంద్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించి ఇప్పటికే ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
గురువారం ఇందులో హీరోయిన్స్‌ని అనౌన్స్ చేశారు. గోపీచంద్‌కు జోడిగా ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ నటిస్తున్నారని, ఇద్దరూ సమాన ప్రాధాన్యత గల పాత్రలు పోషిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు ‘కె.జి.ఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.