బిగ్ బాస్ జంట బ్రేకప్.. అతనితో విడిపోతున్నట్లు నటి కామెంట్స్!

బిగ్ బాస్ జంట బ్రేకప్.. అతనితో విడిపోతున్నట్లు నటి కామెంట్స్!

బుల్లితెర, హిందీ బిగ్ బాస్ 16 జంట 'ప్రియాంక చాహర్ చౌదరి మరియు అంకిత్ గుప్తా' బ్రేకప్ వార్తలు ఊపందుకున్నాయి. అంకిత్ ఇటీవల ప్రియాంక ప్రధాన పాత్రలో నటించిన “తేరే హో జాయేన్ హమ్”షో నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇటీవలే వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేయడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ క్రమంలో వీరి బ్రేకప్ రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

వీటికితోడు లేటెస్ట్గా ప్రియాంక చౌదరి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ' మార్పు రావడం మంచిదే. జీవితంలో ఎదగాలంటే మార్పులు రావాలి. అప్పుడే ముందుకు సాగుతాం. కాబట్టి, ఖచ్చితంగా, పరిణామం చెందడం మంచి విషయం, అది సంబంధంలో అయినా లేదా ఫ్యాషన్‌లో అయినా.. " అని మాట్లాడింది. దీంతో వీరిద్దరూ విడిపోవడం వల్లే ఇన్ని మార్పులు చూస్తున్నాం అంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

►ALSO READ | Ilayaraja: రూ.5 కోట్లు కట్టాలంటూ.. గుడ్ బ్యాడ్ అగ్లీ మేకర్స్కు లీగల్ నోటీసు పంపిన ఇళయరాజా

అయితే, ప్రియాంక లేదా అంకిత్ తమ బ్రేకప్ రూమర్స్పై బహిరంగంగా ఎప్పుడు స్పందించలేదు. కానీ, ఇన్ డైరెక్ట్గా ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, అంకిత్ షో నుండి వెళ్లిపోవడం, ప్రియాంక మార్పు విషయంపై మాట్లాడటం రూమర్స్కు బలాన్ని ఇస్తున్నాయి. ఇకపోతే వీరిద్దరూ మొదట 'ఉదరియన్' సెట్స్‌లో కలుసుకున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ 16 లో కలిసి కనిపించారు.