బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా సినీ సెలబ్రేటీలు తమ పిల్లలని ఎంకరేజ్ చేస్తుంటారు. ముఖ్యంగా స్టార్ హీరో, హీరోయిన్స్ పిల్లలకైతే ఏకంగా ప్రముఖ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ రెడ్ కార్పెట్ పరిచిమరీ ఇండస్ట్రీకి లాంచ్ చేస్తుంటాడు. ఈ నెపోటిజం అంశంపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఇందులోభాగంగా ప్రముఖ హీరో హ్రితిక్ రోషన్ అలాగే ఆయన తండ్రి రాకేష్ రోషన్ ఇండస్ట్రీలో నెపోటిజం ని అసస్లు ఎంకరేజ్ చెయ్యరని తెలిపింది. ఈ కారణంగానే నాలాంటి వాళ్ళు అవకాశాలు దక్కించుకుని కెరీర్ లో నిలదొక్కుకోగలుగుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేసింది. అలాగే చివరిగా తను నటించిన 6 సినిమాలు ఫ్లాప్ అయ్యాయని దాంతో తనకి బాలీవుడ్ నుంచి మద్దతు లభించలేదని అందుకే ఇండస్ట్రీని వదిలి హాలీవుడ్ కి వెళ్లానని ఎమోషనల్ అయ్యింది.
ALSO READ | Sobhita Dhulipala: శుభవార్త చెప్పిన శోభితా అక్కినేని.. కల? నిజమా? అంటూ ఇన్స్టా పోస్ట్
ఈ విషయం ఇలా ఉండగా నటి ప్రియాంక చోప్రా ఈమధ్య బాలీవుడ్ లో కంటే ఎక్కువగా హాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతోంది. ప్రస్తుతం హాలీవుడ్ లో ది బ్లఫ్, హెడ్స్ ఆఫ్ స్టేట్, సిటాడెల్ సీజన్ 2, జోనాస్ బ్రదర్స్‌తో కలిసి హాలిడే మూవీ తదితర సినిమాల్లో నటిస్తోంది. అలాగే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న SSMB29 సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకుని ప్రారంభమైంది.