SSMB29: హైదరాబాద్కు ప్రియాంకా చోప్రా.. మహేశ్, రాజమౌళి సినిమా కోసమేనా? వీడియో వైరల్

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలతో స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ త్వరలో టాలీవుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుందట. అందుకోసం ప్రియాంక చోప్రా హైదరాబాద్ వచ్చిందట. మరి ఆ సినిమా ఏంటీ? హీరో ఎవరు? అనే వివరాలు చూద్దాం.. 

మహేశ్ బాబు, రాజమౌళి SSMB 29 సినిమాలో హీరోయిన్గా ప్రియాంక చోప్రా నటించనున్నట్లు టాక్. అందుకోసం ప్రియాంక చోప్రా జనవరి 16న సాయంత్రం హైదరాబాద్‌లో ల్యాండ్ అయింది. చాలా రోజుల తర్వాత ప్రియాంక చోప్రా ఇండియాకి రావడం, మరి ముఖ్యంగా హైదరాబాద్ కి రావడం సినీ వర్గాల్లో ప్రత్యేకత సంతరించుకుంది. భారీ కట్టుదిట్టమైన భద్రత నడుమ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ప్రియాంక చోప్రా నడిచొస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే, ఈ గ్లోబల్ బ్యూటీ రాక SS రాజమౌళి సినిమా కోసమే అని బలంగా వినిపిస్తోంది.

అంతేకాకుండా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ రీల్‌ను షేర్ చేసింది. అందులో ఆమె ఫ్లైట్ టొరంటో నుండి దుబాయ్-హైదరాబాద్‌కు చేసే తన ప్రయాణాన్ని పోస్ట్ చేసింది. అయితే, ఈ రీల్ కోసం RRR మ్యూజిక్ బీట్ ఉపయోగించడం అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో కొంతకాలంగా SSMB 29లో హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తున్నట్లు వస్తున్న రూమర్స్ ఇపుడు కాస్త నిజమయ్యాయి. మహేష్ బాబుకు జోడిగా గ్లోబల్ బ్యూటీ నటిస్తుండటంతో సూపర్ స్థార్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్కి సంబంధించి అన్ని విషయాలను దర్శకుడు రాజమౌళి వెల్లడించే అవకాశం ఉంది.

Also Read :- క్యాజువల్ వేర్‌లో తమన్నా, విజయ్ వర్మ ఎంట్రీ

అంతేకాకుండా జనవరి 17న, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ రీల్‌ను షేర్ చేసింది. అందులో ఆమె ఫ్లైట్ టొరంటో నుండి దుబాయ్ నుండి హైదరాబాద్‌కు చేసే ప్రయాణాన్ని పోస్ట్ చేసింది. అయితే, ఈ రీల్ కోసం RRR మ్యూజిక్ బీట్ ఉపయోగించడం అందరి దృష్టిని ఆకర్షించింది.