బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో మన దేశం నుంచి ‘అనూజ’ (Anuja) చిత్రం ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్‌లో చోటు సంపాదించింది. ఈ కేటగిరీలో మొత్తం 180 సినిమాలు పోటీపడగా, అందులో ఐదు నామినేట్ అయ్యాయి. ఏలియన్, ఐ యామ్ నాట్ ఎ రోబోట్, ది లాస్ట్ రేంజర్,ది మ్యాన్ హు కుడ్ నాట్ రిమైన్ సైలెంట్ చిత్రాలతో ‘అనూజ’ పోటీపడుతోంది.
22 నిమిషాల నిడివి గల ఈ షార్ట్ ఫిల్మ్‌కు ఆడమ్ జో గ్రేవ్స్ దర్శకుడు. మిండి కాలింగ్, గునిత్ మోంగా, హీరోయిన్ ప్రియాంక చోప్రా నిర్మాతలుగా వ్యవహరించారు. అనూజ పాత్రలో సజ్జా పఠాన్, తన అక్క పాలక్‌గా అనన్య షాన్ బాగ్, వర్మ పాత్రలో నగేష్ బోంస్లే నటించారు. త్వరలో ఇది నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కాబోతోంది.
నిర్మాతల్లో ఒకరైన గునీత్ మోంగా గతంలో నిర్మించిన ఎలిఫెంట్ విస్పరర్స్ (2022), పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్ (2018) అనే డాక్యుమెంటరీస్ ఆస్కార్స్ గెలుచుకున్నాయి. దీంతో ఆస్కార్స్‌లోనూ ఆమె హ్యాట్రిక్ అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రియాంక చోప్రా కూడా నిర్మాతల్లో ఒకరు కావడంతో అందరి దృష్టిని ఈ చిత్రం ఆకట్టుకుంది. మరి ‘అనూజ’కు ఆస్కార్ వరిస్తుందేమో చూడాలి! ఈ ఏడాది మార్చి 2న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.
అనూజ కథ:
న్యూ ఢిల్లీలోని ఒక బట్టల ఫ్యాక్టరీలో పనిచేసే 9 ఏళ్ల పాప, ఆమె అక్క పాలక్ చుట్టూ కథ తిరుగుతుంది. 9 ఏళ్ల అమ్మాయి అనూజ తన భవిష్యత్తు కోసం అన్వేషించే మార్గంలో సమాజంలో తనకు ఎదురైనా అనుభవాలను అద్దం పట్టేలా చేస్తుంది. తన వ్యక్తిగత భవిష్యత్తు కోసం చదువుకోవాలా? లేక కుటుంబం కోసం చదువును త్యాగం చేయాలా? అనే సందిగ్ధం, సంఘర్షణల మధ్య జీవితాలు ఎలా నలిగిపోతున్నాయి? అందుకు వారు తీసుకున్న నిర్ణయాలతో జీవితం ఎలా మారింది? వారికి తోడ్పడిన టీచర్ ఎవరు? బాల కార్మికుల జీవితాల్లోని ఓ తెలియని కోణాన్ని ఈ షార్ట్ ఫిల్మ్ ఆవిష్కరించింది.
ALSO READ | Game Changer: బిగ్ షాక్.. ఆన్‌లైన్‌లో 'గేమ్ ఛేంజర్' అల్ట్రా HD వెర్షన్ లీక్.. కారణమెవ్వరు?
ఇకపోతే గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా షార్ట్ ఫిల్మ్ అనుజకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది. రెండుసార్లు ఆస్కార్-విజేతగా నిలిచినా నిర్మాత గునీత్ మోంగ నిర్మించింది. ఆడమ్ జె గ్రేవ్స్ దర్శకత్వం వహించారు.ఇప్పటికే నిర్మాత గునీత్ మోంగా 2019లో 91వ అకాడమీ అవార్డ్స్‌లో 'ఎండ్ ఆఫ్ సెంటెన్స్' ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్‌గా ఆస్కార్‌ను సొంతం చేసుకుంది. అలాగే 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' 2023లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గా నిలిచింది.