PriyankaChopra: ఆస్కార్ 2025 షార్ట్‌లిస్ట్కు అనూజ.. గర్వంగా ఉందంటూ ప్రియాంక చోప్రా ఎమోషనల్

యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ ఫీచర్, డాక్యుమెంటరీ షార్ట్, ఇంటర్నేషనల్ ఫీచర్, లైవ్ యాక్షన్ షార్ట్, మేకప్ మరియు హెయిర్ స్టైలింగ్, ఒరిజినల్ స్కోర్, ఒరిజినల్ సాంగ్, సౌండ్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ వంటి 10 కేటగిరీల కోసం 97వ అకాడెమీ అవార్డుల షార్ట్‌లిస్ట్‌లను అకాడమీ విడుదల చేసింది.

లైవ్-యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో 'అనూజ '(Anuja) ఆస్కార్ 2025కి నామినేట్ అయింది. గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా షార్ట్ ఫిల్మ్ అనుజకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది. రెండుసార్లు ఆస్కార్-విజేతగా నిలిచినా నిర్మాత గునీత్ మోంగ నిర్మించింది. ఆడమ్ జె గ్రేవ్స్ దర్శకత్వం వహించారు.

ఇప్పటికే నిర్మాత గునీత్ మోంగా 2019లో 91వ అకాడమీ అవార్డ్స్‌లో 'ఎండ్ ఆఫ్ సెంటెన్స్' ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్‌గా ఆస్కార్‌ను సొంతం చేసుకుంది. అలాగే 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' 2023లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గా నిలిచింది.

Also Read : మూడు ఓటీటీల్లోకి లేటెస్ట్ తెలుగు యాక్షన్ డ్రామా మూవీ

ఈ చిత్రంతో తనకున్న అనుబంధం గురించి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) మాట్లాడుతూ, "ఈ షార్ట్ ఫిలిం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది పిల్లలను ప్రభావితం చేసే అంశం ఇందులో ఉంది. అనుజ ఒక పదునైన, ఆలోచనను రేకెత్తించే భాగం. మన జీవిత గమనాన్ని ఎలా రూపొందిస్తాయో లోతుగా ప్రతిబింబించేలా చేస్తుంది. అటువంటి అద్భుతమైన మరియు ప్రభావవంతమైన ప్రాజెక్ట్‌లో నేను భాగమైనందుకు చాలా గర్వపడుతున్నానని" ప్రియాంక చోప్రా తెలిపింది. 

అనూజ గురించి:

న్యూ ఢిల్లీలోని ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే అనూజ మరియు తన అక్క పాలక్‌తో జీవితాల నేపథ్యంలో తెరకెక్కింది. 9 ఏళ్ల అమ్మాయి అనూజ తన భవిష్యత్తు కోసం అన్వేషించే మార్గంలో సమాజంలో తనకు ఎదురైనా అనుభవాలను చూపిస్తుంది. తనతో పాటుగా తన అక్క పాలక్ ల జీవితాలు ఎలా నలిగిపోతున్నాయి? అందుకు వారు తీసుకున్న నిర్ణయాలతో వారి జీవితం ఎలా మారింది? అందుకు తోడ్పడిన టీచర్ ఎవరు? అనేది ఈ షార్ట్ ఫిల్మ్ కథ. 

ఇకపోతే ఉత్తమ చిత్రం విభాగంలో పోటీపడుతున్న 207 చిత్రాలలో.. ఏడు భారతీయ చిత్రాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అందులో కంగువ (తమిళం), ఆడుజీవితం (ది గోట్ లైఫ్ ) (మలయాళం), సంతోష్ (హిందీ), స్వాతంత్ర్య వీర్ సావర్కర్ (హిందీ), All We Imagine as Light (మలయాళం-హిందీ), గర్ల్స్ విల్ బి గర్ల్స్ (హిందీ-ఇంగ్లీష్) ) మరియు పుతుల్ (బెంగాలీ) ఉన్నాయి. 

ఓటింగ్ ఎప్పుడంటే?

ఆస్కార్ 2025 నామినేష‌న్స్‌కు సంబంధించిన ఓటింగ్ 2025 జ‌న‌వ‌రి 8న మొదలైంది. జ‌న‌వ‌రి 12న ముగుస్తుంది. నామినీల తుది జాబితా జ‌న‌వ‌రి 17న ఫైన‌ల్ లిస్ట్‌ను ఆస్కార్‌ అకాడమీ ప్ర‌క‌టించ‌బోతున్నారు. అకాడమీ అవార్డుల వేడుక మార్చి 2న జరగనుంది. ఓవేషన్ హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ వేడుక ఘనంగా జరగనుంది.