మంగళసూత్రం ధరించినప్పుడు అలా ఫీల్ అయ్యా

మంగళసూత్రం ధరించినప్పుడు అలా ఫీల్ అయ్యా

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మంగళసూత్రం గురించి మొదటిసారిగా చెప్పుకొచ్చింది. ఆమెకు పెళ్లైన విషయం తెలిసిందే. ప్రియాంక పెళ్లై నాలుగేళ్లు అవుతున్నాయి. అయితే తాజాగా ప్రియాంక తాను మొదటిసారి మంగళసూత్రం ధరించిన సంగతి గుర్తు చేసుకుంది. ఓ జువెలరీ సంస్థ కోసం చేసిన ప్రచారంలో మంగళసూత్రాన్ని వేసుకొని దాని అర్థం గురించి కూడా మాట్లాడింది. ఆమె వీడియోలో మాట్లాడుతూ ప్రియాంక భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు  గురించి ప్రస్తావించింది. తాను మంగళసూత్రం ధరించిన మూమెంట్ ను గుర్తు చేసుకుంది. ఆ సమయం తనకు ఇంకా బాగా గుర్తుందని చెప్పుకొచ్చింది. ఎందుకంటే  మనం మన సంస్కృతి సాంప్రదాయాల్ని గురించి తెలుసుకొని ఎదుగుతాం. అదే సమయంలో ఓ మహిళగా కూడా తాను మంగళసూత్రం ప్రాధాన్యత గురించి తనకు తెలుసని చెప్పింది. ఇక మంగళసూత్రంలో ఉండే.. నల్లటి పూసలు.. దుష్ట శక్తులపై పోరాడతాయని మనల్ని రక్షిస్తాయని  ప్రియాంక చెప్పింది.  ఓ ఆధునికంగా స్త్రీ, మంగళ సూత్రం వేసుకోవాలా లేదా వాటి పరిణామాలు ఎలా ఉంటాయన్న విషయాలపై కూడా తనకు అవగాహన ఉందని తెలిపింది ప్రియాంక. మంగళసూత్రాన్ని ధరించడం నాకు ఇష్టమా లేదా అది పితృస్వామ్యమైనదా?" అని ఆమె వీడియోలో చెప్పింది. మరి రానున్న కాలంలో అమ్మాయిలు మంగళసూత్రాలు ధరిస్తారో లేదో చూడాలని ప్రియంక చెప్పుకొచ్చింది. 

 గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక వరల్డ్‌వైడ్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకున్న ప్రియాంక హాలీవుడ్‌లో కూడా తన సత్తా చాటుతోంది. అయితే తాను ఎక్కడికి వెళ్లినా తనతోపాటే ఇండియా ఉంటుందని ప్రియాంక చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎక్కడికి వెళ్లిన తన అస్థిత్వాన్ని, గుర్తింపును ఎవరూ తక్కువ చేయకుండా ఉన్నతంగా ఎదుగుతూవస్తోంది.తాజాగా భారతతీయ సంస్కృతి సంప్రదాయాలతో పాటు.. మంగళసూత్రం గొప్పదనం గురించి కూడా ప్రియాంక తన దైన శైలిలో చెప్పడంతో ఆమె అభిమానులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రియంక చోప్రా.. ప్రముఖ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లాడిన విషయం తెలిసిందే. వీరిద్దరు తొలిసారిగా 2017లో గ్రాండ్ ఫ్యాషన్ ఈవెంట్ మెట్ గాలాలో కలిశారు. ఆ తర్వాత ప్రియాంక పుట్టినరోజున నిక్ ఆమెకు తన ప్రేమను తెలిపారు. వీరిద్దరూ 2018లో పెళ్లి చేసుకున్నారు. సిటాడెల్ అనే కొత్త ప్రొజెక్టులో ప్రియాంక చోప్రా నటిస్తోంది. నిక్ ను పెళ్లాడిన తర్వాత ప్రియాంక ఎక్కువగా హాలీవుడ్ సినిమాల్లోనే కనిపిస్తోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priyanka (@priyankachopra)