SSMB29: రాజమౌళి మూవీలో చోప్రా రోల్ ఇదే.. పృథ్వీరాజ్ స్థానంలో మరో స్టార్ నటుడు.. క్రేజీ అప్డేట్స్ ఇవే!

SSMB29: రాజమౌళి మూవీలో చోప్రా రోల్ ఇదే.. పృథ్వీరాజ్ స్థానంలో మరో స్టార్ నటుడు.. క్రేజీ అప్డేట్స్ ఇవే!

ప్రపంచంలో అత్యంత ఆసక్తికర ప్రాజెక్టులలో SSMB29 ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇంటర్నేషనల్ వైడ్గా సినీ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం SSMB29 నుండి ఓ ఇంట్రెస్టింగ్ టాక్ మొదలైంది. ఈ మూవీలో మహేష్ బాబుకి (Mahesh Babu) జోడిగా ప్రియాంక చోప్రా(PriyankaChopra) కనిపిస్తున్నట్లు ముందు నుంచి టాక్ వినిపించింది. అయితే, ఇప్పుడామె పూర్తి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తుందని కొత్త టాక్ మొదలైంది.

అంతేకాకుండా మెయిన్ విలన్గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు పృథ్వీరాజ్ స్థానంలో బాలీవుడ్ యాక్టర్ జాన్ అబ్రహంను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Also Read : రాజకీయ పార్టీ తరహాలో స్పోక్స్ పర్సన్ ని నియమించుకోబోతున్న అల్లు అర్జున్

ఇటీవలే ప్రియాంక చోప్రా SSMB 29 షూట్కి గ్యాప్ ఇచ్చి ముంబైకి వెళ్లింది. ఆమె సోదరుడు సిద్ధార్థ్ చోప్రా పెళ్లి కోసం చోప్రా వెళ్లడంతో ఆమె లేకుండానే మిగతా పోర్షన్‌‌‌‌ను షూట్ చేసేలా రాజమౌళి ప్లాన్ చేశారట. ప్రస్తుతం మహేష్ బాబుతో కూడిన కొన్ని కీలక సీన్స్ జక్కన్న చిత్రీకరిస్తున్నట్టు సమాచారం.

దాదాపు రూ.1,000 కోట్ల భారీ బడ్జెట్తో దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కెఎల్ నారాయణ SSMB 29 నిర్మిస్తున్నారు. ఇది రెండు భాగాలుగా తెరకెక్కనుంది. మొదటి భాగాన్ని 2027లో, రెండవ భాగాన్ని 2028లో విడుదల చేయాలని జక్కన్న భావిస్తున్నారు.