క్రేజీ స్వీకెల్‎లో ప్రియాంక చోప్రా.. మళ్లీ ఇండియన్ మూవీస్‎పై బాలీవుడ్ బ్యూటీ ఫోకస్

క్రేజీ స్వీకెల్‎లో ప్రియాంక చోప్రా.. మళ్లీ ఇండియన్ మూవీస్‎పై బాలీవుడ్ బ్యూటీ ఫోకస్

గత కొంతకాలంగా వరుస హాలీవుడ్ ప్రాజెక్ట్స్‌‌‌‌‌‌‌‌తో గ్లోబల్ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రాణిస్తున్న ప్రియాంక చోప్రా.. తిరిగి ఇప్పుడు ఇండియన్‌‌‌‌‌‌‌‌ సినిమాలపై ఫోకస్‌‌‌‌‌‌‌‌ పెడుతోంది. ముఖ్యంగా మహేష్ ,  రాజమౌళి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌కు కమిటయ్యాక కొత్త ప్రాజెక్టులకు సంబంధించి తన పేరు తరచుగా వినిపిస్తోంది. ఇటీవల అల్లు అర్జున్‌‌‌‌‌‌‌‌ హీరోగా అట్లీ తెరకెక్కించబోయే పాన్‌‌‌‌‌‌‌‌ ఇండియా ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లో ప్రియాంకను సంప్రదిస్తున్నట్టు ప్రచారంలో ఉంది. ఇదిలా ఉంటే తాజాగా హృతిక్‌‌‌‌‌‌‌‌ రోషన్‌‌‌‌‌‌‌‌కు జంటగా మరోసారి ప్రియాంక నటించబోతున్నట్టు బాలీవుడ్ సమాచారం.

హృతిక్ హీరోగా నటిస్తూ, డైరెక్ట్ చేయబోతున్న ‘క్రిష్‌‌‌‌‌‌‌‌ 4’లో ప్రియాంక నటించబోతోందట. నిజానికి క్రిష్‌‌‌‌‌‌‌‌, క్రిష్‌‌‌‌‌‌‌‌ 3 చిత్రాల్లో ఆమె నటించింది కనుక సీక్వెల్‌‌‌‌‌‌‌‌లోనూ తన క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండటం సహజం.   అదీకాక ఇటీవల ప్రియాంక భర్త నిక్ జోనాస్‌‌‌‌‌‌‌‌ పెర్ఫార్మ్‌‌‌‌‌‌‌‌ చేసిన మ్యూజికల్‌‌‌‌‌‌‌‌ షో ‘ది లాస్ట్‌‌‌‌‌‌‌‌ ఫైవ్ ఇయర్స్‌‌‌‌‌‌‌‌’కు తన గర్ల్‌‌‌‌‌‌‌‌ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌ సబా ఆజాద్‌‌‌‌‌‌‌‌తో కలిసి హాజరయ్యాడు హృతిక్. అంతేకాదు నైట్‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన ఫొటోస్‌‌‌‌‌‌‌‌ను షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ నిక్ జోనాస్‌‌‌‌‌‌‌‌ షోపై ప్రశంసలు కురిపించాడు. దీంతో ఇప్పటికే ‘క్రిష్‌‌‌‌‌‌‌‌ 4’ గురించి ప్రియాంకతో హృతిక్‌‌‌‌‌‌‌‌ చర్చించాడని, ఆమె ఈ సినిమాకు ఇప్పటికే ఓకే చెప్పిందనే ప్రచారం జరుగుతోంది.  ఏదేమైనా కొంత గ్యాప్‌‌‌‌‌‌‌‌ తర్వాత హృతిక్ సినిమాతో బాలీవుడ్‌‌‌‌‌‌‌‌లో రీఎంట్రీ ఇస్తోంది ప్రియాంక.