SSMB29: ప్రియాంక చోప్రా హార్డ్ వర్క్.. మహేష్ను ఢీ కొట్టాలంటే కావాల్సింది.. 'వ్యూహమా.. యుద్దమా!'

SSMB29: ప్రియాంక చోప్రా హార్డ్ వర్క్.. మహేష్ను ఢీ కొట్టాలంటే కావాల్సింది.. 'వ్యూహమా.. యుద్దమా!'

ప్రిన్స్ మహేశ్ బాబు, గ్లోబర్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమా SSMB 29. ఈ సినిమా కోసం దాదాపు వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా రెండు భాగాలుగా ఉంటుందనే కథనాలు కూడా వస్తున్నాయి.

ఈ మూవీలో హాలీవుడ్ తార ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. రాజమౌళి పవర్ ఫుల్ కథ, పాన్ వరల్డ్ మేకింగ్ కు.. మహేష్ బాబు సింహంలాంటి లుక్ తోడైతే.. హాలీవుడ్ బాక్సాఫీస్ లు కూడా బ్లాస్ట్ అవ్వడం ఖాయం అని అంటున్నారు సినీ క్రిటిక్స్.

ఇటీవలే మహేశ్ బాబు లేటెస్ట్ లుక్ లీకైంది. ఈ లుక్ లో వేటకు సిద్ధమైన సింహంలా కనిపిస్తున్నాడు ప్రిన్స్. అలాగే SSMB 29 కోసం ప్రియాంక చోప్రా చాలా హార్డ్ వర్క్ చేస్తోంది. ఈ సినిమాలో పీసీ విలన్ గా నటిస్తోందనే టాక్ ఉంది. ఇందుకు సంబందించిన లుక్ టెస్ట్ కూడా ఫినిష్ చేశారట.

Also Read :- ఓటీటీకి వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ పట్టుదల

అయితే, మహేష్ను ఢీ కొట్టాలంటే ప్రియాంక చోప్రా చేసేది యుద్దమా.. తెలివైన వ్యూహమా? అనేది ఆసక్తి రేపుతోంది. ఇకపోతే, ఈ సినిమాలో హీరోయిన్గా హాలీవుడ్ బ్యూటీని తీసుకునేందుకు పరిశీలిస్తున్నారని సమాచారం.

బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహంను ఈ పాన్ ఇండియా సినిమాలో ఓ రోల్ కోసం సంప్రదింపులు చేస్తున్నారనే టాక్ కూడా ఉంది. ఏది ఏమైనా SSMB29పై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ మూవీపై సర్వతా ఆసక్తి నెలకొంది. త్వరలో ఈ సినిమాపై జక్కన్న ప్రెస్ మీట్ పెట్టి కాన్సెప్ట్ వీడియో రీలిజ్ చేస్తాడనే టాక్ కూడా నడుస్తోంది. చూడాలి మరి ఏమవుతుందో!