
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) గత వారం హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలను దర్శించుకుంటున్నారు.
ఈ క్రమంలో కామారెడ్డి జిల్లాలోని దోమకొండ కోటలోని మహాదేవుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అద్దాల మేడను, రాణీమహల్ను సందర్శించారు. అక్కడున్నఇతర కట్టడాలను సైతం క్షుణ్ణంగా పరిశీలించారు ప్రియాంక చోప్రా.
ఈ దోమకొండ కోట కామినేని వంశీయులకు చెందినది. నిజాం నవాబులకు, అంతకు ముందు కాకతీయులకు కామినేని వంశీయులు సామంతులుగా ఉంటూ దోమకొండ సంస్థానాన్ని పాలించే వారు. కామినేని ఉమాపతి రావు మనవరాలు, కామినేని అనిల్ కూతురే ఉపాసన కామినేని. ఈమె మెగా హీరో రామ్ చరణ్ తేజ్ సతీమణి.
ఇటీవలే (జనవరి 21, 2025) ప్రియాంక చోప్రా తెలంగాణ తిరుపతిగా పేరు పొందిన చిలుకూరు బాలాజీ ఆలయాన్నిసందర్శించి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయాన్ని సందర్శించిన ఆమెకు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సత్కరించారు.